• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..

|

అటువైపు యుద్ధ విమానాల చక్కర్లు.. ఇటువైపు శతఘ్నుల కదలికలు.. రెండువైపులా భారీ ఎత్తున సైనిక బలగాల మోహరింపు.. కరోనా తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోవడం.. ఇంటా బయటా జిన్ పింగ్ పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విమర్శలకు సమాధానంగా చైనా యుద్ధతంత్రాన్ని ఎంచుకుందని.. ఇండియాతో సరిహద్దు స్థాయిలో సుదీర్ఘ పోరుకు సిద్ధపడిందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అందుకు తగ్గట్లే ఉన్నత స్థాయి చర్చల్లోనూ చైనా మంకుపట్టు ధోరణి ప్రదర్శించినట్లు వార్తలొచ్చాయి. కానీ నిజంగా చర్చల పక్రియలో ఏం జరిగిందో తొలిసారి అధికారిక ప్రకటన వెలుడింది. దీంతో యుద్ధంపై స్పష్టత ఏర్పడింది.

  India China border standoff Latest news

  చర్చల్లో చైనా బెట్టు.. ఆ రెండిటిపై పట్టు.. మోదీ, దోవల్‌కు ఆర్మీ బ్రీఫింగ్.. తర్వాత ఏంటంటే..

  ఎంఈఏ ప్రకటన..

  ఎంఈఏ ప్రకటన..

  గడిచిన నెల రోజులుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొంది. తూర్పు లదాక్ లో భారత్ నిర్మిస్తోన్న వ్యూహాత్మక రోడ్డును అడ్డుకునే క్రమంలో చైనా మన భూభాగంలోకి చొచ్చుకురావడం, కీలకమైన పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్, గాల్వాన్ లోయలో భారత్ పోస్టులను చైనా చుట్టుముట్టడం, అక్కడ గస్తీ కాస్తోన్న భారత బలగాలను అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఉద్రిక్తతలకు కారణమైంది. దీన్ని నివారించేందుకు పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో శనివారం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో భేటీ జరిగింది. ఆ చర్చలకు సంబంధించి విదేశాంగ శాఖ ఆదివారం తొలిసారిగా అధికారిక ప్రకటన చేసింది.

  ఇంకొన్నిగంటల్లో చైనా ఖేల్ ఖతం.. అజెండా.. యుద్ధవిమానాలు, శతఘ్నుల హోరు.. అసలు కారణాలు ఇవే..

  ఇక యుద్ధం లేనట్లే..

  ఇక యుద్ధం లేనట్లే..

  చర్చలకు కొద్ది గంటల ముందు కూడా చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ యుద్ధ భాషలో మాట్లాడింది. అమెరికాకు దగ్గరయ్యేందుకే భారత్ కయ్యానికి కాలుదువ్వుతోందని, భారతే చైనా భూభాగాన్ని ఆక్రమించిందని, వెనక్కి పోకుంటే తీవ్ర చర్యలు తప్పవంటూ తన మీడియాలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఈ దుందుడుకు ప్రకటనల ప్రభావం చర్చలపై పడలేదని భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) ప్రకటనతో స్పస్టమైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎలాంటి సమస్యనైనా ‘శాంతియుతంగా మాత్రమే' పరిష్కరించుకునేందుకు రెండు దేశాల మిలటరీ అధికారులు సంపూర్ణ అంగీకారం తెలిపినట్లు ఎంఈఏ అధికారిక ప్రతినిధి ఆదివారం మీడియాకు వెల్లడించారు. దీంతో ఇక యుద్ధం లేనట్లేనని క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ వచ్చినట్లయింది. కానీ..

  పరిష్కారం లేకుండానే..

  పరిష్కారం లేకుండానే..

  భారత్-చైనా మధ్య హెలెవ్ సైనికాధికాల చర్చల్లో.. దేప్పాంగ్ - గల్వాన్ లోయకు మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డుకు డబుల్ లైన్ విస్తరణ, పాంగాంగ్ సరస్సు దగ్గరున్న ఫింగర్స్ ఆక్రమణ అంశాలపై పీటముడి పడింది. నిజానికి రోడ్డు నిర్మాణం జరుగుతున్నది భారత భూభాగంలోనే అయినా.. అది గత ఒప్పందాలకు విరుద్ధమని చైనా వాదించినట్లు తెలిసింది. భారత్ నిర్మాణాలను ఆపేదాకా.. ఫింగర్ 4 ప్రాంతం నుంచిగానీ, ఎల్ఏసీ వెంబడి కీలక పాయింట్ల నుంచిగానీ వెనక్కి తగ్గబోమని చైనా అన్నట్లు సమాచారం. భారత్ మాత్రం ఏప్రిల్ చివరి నాటి స్టేటస్ కో కోసం పట్టుపట్టింది. దీంతో ఎలాంటి పరిష్కారం రాకుండానే ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయి.

  ఏది జరిగినా శాంతియుతంగానే..

  ఏది జరిగినా శాంతియుతంగానే..

  శనివారం నాటి చర్చలు పరిష్కారం లేకుండా ముగిసినప్పటికీ.. శాంతికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ వచ్చిందని విదేశాంగ శాఖ తెలిపింది. ‘‘ఈ ఏడాదితో భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయి. శనివారం నాటి మిలటరీ స్థాయి చర్చల్లో ఇరుపక్షాలు ఈ అంశాన్ని గుర్తుచేసుకున్నాయి. సరిహద్దు వివాదాలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాలు, తీర్మానాలన్నీ రెండు దేశాల అభివృద్ధికి దోహదపడేవే అని ఇరు ఇరుపక్షాలూ అంగీకరించాయి. గత ఒప్పందాల ప్రకారమే.. ప్రస్తుత పరిస్థితని శాంతియుత మార్గంలో మాత్రమే పరిష్కరిచుకోవాలని నిర్ణయించుకున్నాయి''అని ఆదివారం నాటి తాజా ప్రకటనలో పేర్కొంది.

  రాబోయే రోజుల్లో..

  రాబోయే రోజుల్లో..

  లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చల్లో చైనా వాదనను, చర్చల మొత్తం సారాన్ని ఆర్మీ అధికారుల బృందం.. భారత ప్రధాని మోదీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖకు బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గేలా, ఏప్రిల్ నాటి స్టేటస్ కో తిరిగి ఏర్పడేలా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని, సైనిక స్థాయిలోనే కాకుండా దౌత్యపరంగానూ భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరుగనున్నట్లు స్పష్టమైంది. చైనా తన సైన్యాలను వెనక్కి తీసుకోకపోవడంతో భారత్ సైతం అందుకు సమానమైన సంఖ్యలో బలగాలను కొనసాగిస్తున్నది.

  English summary
  Indian and Chinese military commanders agreed to peacefully resolve the current border issue in eastern Ladakh in accordance with bilateral pacts as well as the agreements, the External Affairs Ministry said on Sunday. and conforms that military, diplomatic talks to continue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X