వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకొన్నిగంటల్లో చైనా ఖేల్ ఖతం.. అజెండా.. యుద్ధవిమానాలు, శతఘ్నుల హోరు.. అసలు కారణాలు ఇవే..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. లదాక్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఇరు దేశాల సైన్యాలు భారీగా మోహరించాయి. వివాదానికి కేంద్రబిందువులుగా ఉన్న పాంగాంగ్, హాట్ స్ప్రింగ్, గాల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీలు బాహాబాహి తలపడే సీన్ నెలకొంది. ఇప్పటికే కరోనా ధాటికి ఆర్థికంగా కుదేలైన రెండు దేశాలు.. యుద్ధానికి వెళతాయా లేక ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారా అనేది ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. చరిత్రలో మొట్టమొదటిసారి రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం సమావేశం కానున్నారు. అన్ని విధాలుగా చైనా ఖేల్ ఖతం చేసేందుకు భారత్ ఎత్తుగడలు సిద్ధం చేసింది.

Recommended Video

#IndiaChinaBorder : ఇంకొన్ని గంటల్లో తేలనున్న భారత్, చైనా సరిహద్దు వివాదం!

 చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే.. చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే..

వార్ రిహార్సల్స్..

వార్ రిహార్సల్స్..

చర్చల గడువు దగ్గరపడుతున్నకొద్దీ రెండు దేశాలూ బలగాల మోహరింపును ముమ్మరం చేయడంతోపాటు ఆయుధ సంపత్తిని భారీగా పోగేస్తున్నాయి. గడిచిన రెండ్రోజులుగా ఎల్ఏసీకి సమీపంగా చైనీస్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు వార్ రిహార్సల్స్ చేశాయి. అయితే 10 కిలోమీటర్ల మేరలో ఉన్న నాన్ ఫ్లయింగ్ జోన్ లోకి మాత్రం అవి రాలేదని వెల్లడైంది. భారత్ తానేమీ తక్కువతినలేదన్నట్లు బోఫోర్స్ శతఘ్నుల్ని దింపింది. గడిచిన కొద్ది గంటల్లోనే ఇండియన్ ఆర్మీ సుమారు 60 బోఫోర్స్ శతఘ్నుల్ని ఎల్ఏసీకి తరలించినట్లు తెలుస్తోంది. 1999 కార్గిల్ యుద్ధం విజయంలో ఈ శతఘ్నులు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. మన భూభాగంలోని 50 కిలోమీటర్లను(వేర్వేరు ప్రాంతాల్లో) చైనా ఆక్రమించినట్లు సెక్యూరిటీ ఏజెన్సీల తాజా రిపోర్టులో వెల్లడికావడం కలకలం రేపుతున్నది.

ప్రొటోకాల్ మార్పు.. ఇదీ అజెండా..

ప్రొటోకాల్ మార్పు.. ఇదీ అజెండా..

భారత్-చైనాల మధ్య 1962 యుద్ధం తర్వాత కుదిరిన ఒప్పందాల ప్రకారం.. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఏదైనా సమస్య తలెత్తితే.. లోకల్ కమాండర్ల స్థాయిలో చర్చలు జుపుకోవాలనే ప్రోటోకాల్ ఉంది. ఇప్పటిదాకా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే లోకల్ కమాండర్లకు బదులు డివిజనల్ కమాండర్లు(మేజర్ జనరల్) చర్చల్లో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా లెఫ్టినెంట్ జనరల్స్ లెవల్ లో మీటింగ్ జరగడాన్ని బట్టి కొత్త ప్రొటోకాల్స్ రూపొందినట్లు భావించాలని డిఫెన్స్ నిపుణులు చెప్పారు. ఈ చర్చల్లో భారత్ సింగిల్ లైన్ అజెండాతో ముందుకు వెళుతున్నది. ఎల్ఏసీ వెంబడి ఆక్రమించిన భూభాగాన్ని వెంటనే ఖాళీచేసి, బలగాలను వెనక్కి మళ్లించడం తిరిగి స్టేటస్ కో పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. చర్చల కోసం నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి గురువారమే లదాక్ కు చేరుకున్నారు. అయితే డ్రాగన్ మాత్రం..

వైసీపీలో వరుస బాంబులు..ఆనం మళ్లీ ఫైర్ తాజాగా ధర్మాన.. పుష్పశ్రీవాణిపై ఆమె మామ ఆరోపణలు..వైసీపీలో వరుస బాంబులు..ఆనం మళ్లీ ఫైర్ తాజాగా ధర్మాన.. పుష్పశ్రీవాణిపై ఆమె మామ ఆరోపణలు..

చైనా బేరసారాలు..

చైనా బేరసారాలు..


తనది కాని టిబెట్ ను పూర్తిగా కబళించడం ద్వారా చైనా నిజానికి సరిహద్దులను ఎప్పుడో చెరిపేసిందని, ఎల్ఏసీ వెంబడి మూడు ప్రాంతాల్లో తాను ఆక్రమించిన భూభాగాన్ని అడ్డం పెట్టుకుని డ్రాగన్ బేరసారాలకు ప్రయత్నించొచ్చని డిఫెన్స్ నిపుణులు చెప్పారు. ఎల్ఏసీలో తాను వెనక్కి తగ్గాలంటే లేదా ఉద్రిక్తతలు సడలించాలంటే వేరేచోట.. అంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లే ‘చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)'లోగానీ, డ్రాగన్ కలల ప్రాజెక్టు వన్ బెల్ట్ వన్ రోడ్ గానీ, గ్వాదర్ పోర్టు తదితర ప్రాజెక్టుల విషయంలో చైనా కొన్ని సడలింపులు కోరే అవకాశమున్నట్లు ఆర్మీ మాజీ అధికారులు అభిప్రాయపడ్డారు.

మోదీ రిస్క్ చేస్తున్నారా?

మోదీ రిస్క్ చేస్తున్నారా?

ఎన్నడూ లేని విధంగా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలకు భారత్ రెడీ కావడాన్ని చైనా అలుసుగా తీసుకునే అవకాశాలూ లేకపోలేవంటున్న డిఫెన్స్ నిపుణుల్లో కొందరు.. మోదీ ఎత్తుగడలను సైతం తప్పుపడుతున్నారు. లదాక్ లో భారత్ వ్యవహరిస్తున్న తీరును బట్టి మోదీ చైనాతో సంబంధాల విషయంలో రిస్క్ తీసుకుంటున్నారని, అమెరికాకు మరింత దగ్గరయ్యేందుకే ఆయనీ పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ముందుగా బరితెగించింది, ఇప్పటికీ దూకుడుగా వ్యవహరిస్తున్నది చైనాయే అని, సార్వభౌమత్వం విషయంలో ఏ దేశమూ రాజీపడబోదనే కౌంటర్ వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రం సైతం ముందునుంచీ చెబుతున్నది.

చైనాకు పిచ్చెక్కిందా?

చైనాకు పిచ్చెక్కిందా?


1962 యుద్ధం తర్వాత భారత్-చైనా సరిహద్దులో ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. మధ్యలో చైనా పలుమార్లు గీతదాటి ఇవతలికొచ్చిన సందర్భాల్లో కూడా భారత బలగాలు వారిలో బాహాబాహీకి దిగాయేతప్ప ఆయుధాలను వాడలేదు. కాగా, గడిచిన 58 ఏళ్లలో ఎన్నడూ నేనివిధంగా ఈసారి చైనా మరింత మొండిగా, పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తుండటం కలకలంగా మారింది. భారత్ పై చైనా దూకుడుకు అసలు కారణాలు ఇవేనంటూ నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

కొత్త, పాత కారణాలివే..

కొత్త, పాత కారణాలివే..

1.అక్సాయ్ చిన్ మొత్తాన్ని భారత్ తనదేనని పేర్కోవడాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది. 2.చైనా నుంచి వచ్చే పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లపై భారత్ నియంత్రణ విధించింది. 3.కరోనా వైరస్ అనంతర కాలంలో ప్రపంచ స్థాయి కంపెనీలు చాలా వరకు తమ కార్యాలయాలను చైనా నుంచి ఇండియా లేదా వియత్నాంకు మార్చాలని డిసైడ్ అయ్యాయి. 4.చైనా ఎన్నో ఆశలు పెట్టుకున్న సీపెక్ ప్రాజెక్టును నిలువరించేందుకు భారత్ దౌత్యయుద్ధాన్ని ముమ్మరం చేసింది.
5.చైనా కలల ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భారత్ భాగస్వామి కాదల్చుకోలేదు. 6.కరోనా ఫెల్యూర్ కారణంగా జిన్ పింగ్ స్వదేశంలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 7.భారత్ ను దౌత్యపరంగా(అవసరమైతే సైనిక పరంగానూ) ఓడించడం ద్వారా తమ జోలికి రావొద్దని ప్రపంచ దేశాలకు చైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటోంది. 8.అన్నింటికీ మించి అమెరికాకు భారత్ మరింత దగ్గర కావడాన్ని చైనా సహించలేకపోతున్నది. చైనా దూకుడుకు సంబందించి ఈ ఏనిమిది కారణాలు వాస్తవాలు కావొచ్చు లేదా కాకపోవచ్చు. అయితే దీనిపై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.

English summary
first time ever talks between indian and chinese lieutenant generals over standoff in line of actual control(LAC). activities up both sides. india moves Bofors Guns To LAC. eight reasons could tell you why China is making noice
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X