వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు..వాటిని అడ్డుకుంటాం: ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అగ్రదేశపు అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్ - చైనా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో లేవని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్తోంది కాబట్టి చైనా భారత్‌లకు అలా అనిపిస్తుందేమో కానీ వాస్తవానికి .... రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని చెప్పారు. ఒకవేళ అభివృద్ధి చెందుతున్నా దాన్ని తాను అడ్డుకుంటానంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ సీరియస్ వ్యాఖ్యలు

ట్రంప్ సీరియస్ వ్యాఖ్యలు

తన 'అమెరికా ఫస్ట్' విధానంలో విజయం సాధించిన ట్రంప్, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినందుకు భారత్ పై తీవ్రం విమర్శలు చేయడమే కాదు.. సుంకాలు విధించడంలో భారత్ రారాజు అని అభివర్ణించారు ట్రంప్. ప్రస్తుతం చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతనెలలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏమిటో నిర్వచనం ఇవ్వాల్సిందిగా ప్రపంచ వాణిజ్య సంస్థను ట్రంప్ కోరారు. చైనా ,టర్కీ, భారత్‌లకు ప్రపంచ మార్కెట్లలో పలు నిబంధనలు సడలించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

WTO నిబంధనలను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న భారత్ చైనాలు

WTO నిబంధనలను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న భారత్ చైనాలు

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను అడ్వాంటేజ్‌గా తీసుకుని ఆయా దేశ ఆర్థిక వ్యవస్థలు లబ్ది పొందుతున్నట్లు అయితే అలాంటి దేశాలపై చర్యలు తీసుకోవాలని తన పాలనా విభాగానికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. భారత్ చైనాలు ఇదే తరహా అడ్వాంటేజ్‌ తీసుకుని తమను తాము అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకుంటున్నాయని ఓ కార్యక్రమంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జెనీవాలోని డబ్ల్యూటీఓ సంస్థ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను క్రమబద్దీకరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రపంచ వాణిజ్య నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భద్రతా విధానాలు, సుంకం విధింపులో కోతలు, ఎగుమతి రాయితీలను పొందుతున్నాయి. దీన్నే ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు.

భారత్ చైనాలను అడ్డుకుని తీరుతాం: ట్రంప్

భారత్ చైనాలను అడ్డుకుని తీరుతాం: ట్రంప్

అమెరికాను కూడా ఇతర దేశాలతో పాటే సమంగా చూడాలని ప్రపంచ వాణిజ్య సంస్థను ట్రంప్ కోరారు. భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలు పెరిగాయి కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తే మాత్రం అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ట్రంప్. ఇకపై అలా జరగదని చెప్పిన ట్రంప్... అన్ని ఆర్థిక వ్యవస్థలు పెరుగుతున్నాయి కానీ అమెరికా మాత్రం అక్కడే నిలిచిపోయిందనే సీరియస్ కామెంట్స్ చేశారు.

English summary
US President Donald Trump has said that India and China are no longer "developing nations" and were "taking advantage" of the tag from the WTO, even as he asserted that he will not let it happen anymore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X