వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ చైనా: రెండూ కావాల్సిన దేశాలే: ట్రంప్ స్నేహగీతం: ఏమైనా..ఎందాకైనా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ విషయంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడంపై అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఫోకస్ పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడానికి తాము ముందుంటామని మరోసారి స్పష్టం చేసింది. ఇదివరకే పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించిన అమెరికా మరోసారి పాత ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చింది. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం సరికాదని పేర్కొంది.

చైనాపై కొత్త పిడుగు: ఆ దిశగా అమెరికా: కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం: యూఎస్ కాంగ్రెస్ లేఖచైనాపై కొత్త పిడుగు: ఆ దిశగా అమెరికా: కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం: యూఎస్ కాంగ్రెస్ లేఖ

రెండు దేశాల ప్రజలను తాము ప్రేమిస్తున్నామని, వారి మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి సాధ్యమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కెయిలీ మెక్ఎనానీ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా మధ్య సఖ్యత నెలకొనాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నారని అన్నారు.

India China Standoff: ‘Want to do everything possible to keep peace in India and China: Trump

ఈ రెండు దేశాల మధ్య యుద్ధపూరక వాతావరణాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పారు. ఆసియాలో బలమైన దేశాలుగా గుర్తింపు పొందిన భారత్-చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం సరికాదని, దీన్ని నివారించడానికి తాము మధ్యవర్తిత్వాన్ని వహిస్తామనీ స్పష్టం చేశారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి తాము ముందుంటామని వైట్‌హౌస్ ఆర్థిక సలహదారు ల్యారీ కుడ్లోవ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయమేంటనేది ప్రెస్ కార్యదర్శి స్పష్టం చేశారు.

టిక్‌టాక్ సహా చైనా రూపొందించిన యాప్స్‌ను నిషేధించాలంటూ యూఎస్ కాంగ్రెస్ సభ్యులు లేఖ రాసిన రోజే డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి తాజాగా ప్రకటన వెలువడటం ఆసక్తి రేపుతోంది. భారత్‌తో పాటు చైనాను కూడా ప్రేమిస్తున్నామంటూ డొనాల్డ్ ట్రంప్‌ను ఉటంకిస్తూ ప్రెస్ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు రాసిన లేఖపై ట్రంప్ తన వైఖరి ఏమిటనేది పరోక్షంగా స్పష్టం చేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Recommended Video

Huawei 5G Kit Must Be Removed From UK By 2027 || Oneindia Telugu

భారత్‌ సహా ఏ దేశాన్ని కూడా వదులుకోవడానికి లేదా వివాదాలు, ఘర్షణ వాతావరణాన్ని కొని తెచ్చుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేసినట్టయింది. డేటా అభివృద్ధి రంగంలో భారత్‌తో కలిసి పనిచేస్తామంటూ అమెరికా ఇదివరకే వెల్లడించింది. 5జీ డేాటాను అభివృద్ధి చేయడంపై భారత సహకారాన్ని తీసుకుంటామని ఇటీవలే మైక్ పాంపియో వెల్లడించారు. భారత్‌తో తమ స్నేహ సంబంధాలను సుదీర్ఘకాలం పాటు కొనసాగించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని స్పష్టం చేశారు.

English summary
United States President Donald Trump wants to do everything possible to ensure peace for the people of India and China, White House Press Secretary Kayleigh McEnany said on Thursday. “I love the people of India, and I love the people of China, and I want to do everything possible to keep the peace for the people,” McEnany told reporters. She was asked if the president has a message for China amid the tensions between New Delhi and Beijing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X