వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగైన భారత్, దిగజారిన పాక్: వరల్డ్ బ్యాంక్ నివేదిక

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో వ్యాపార అనుకూల దేశాల జాబితాను వరల్డ్ బ్యాంక్ 'Doing Business 2016' పేరిట బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గతేడాది 142వ స్థానంలో ఉన్న భారత్ తాజాగా 130వ స్థానానికి ఎగబాకింది.

అంటే ఏడాది వ్యవధిలోనే భారత్ 12 స్థానాలు ఎగబాకిందన్నమాట. ఇది ఇలా ఉంటే పొరుగు దేశమైన పాకిస్థాన్ మాత్రం తన ర్యాంకును దిగజార్చుకుంది. గతేడాది ఈ జాబితాలో పాకిస్థాన్ 128వ స్థానంలో ఉంటే, తాజా నివేదికలో 10 ర్యాంకులు దిగజారి 138వ స్థానంలో ఉంది.

India climbs 12 spots to rank 130 in World Bank's ease of doing business report

ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆ జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. న్యూజిల్యాండ్, డెన్మార్క్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. చైనా 84వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకులపై భారత ఆర్ధిక రంగ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
India now ranks 130 out of 189 countries in the ease of doing business, moving up 12 places from last year, according to a World Bank report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X