వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే మోడీ ప్రభుత్వం బెస్ట్: తాజా సర్వే ఏం చెబుతోందంటే?

ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.

మోడీ ప్రపంచంలోనే బెస్ట్

మోడీ ప్రపంచంలోనే బెస్ట్

దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం.

ట్రంప్‌నకు దగ్గన పాస్ మార్కులు

ట్రంప్‌నకు దగ్గన పాస్ మార్కులు

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై కేవలం 30శాతం మంది మాత్రమే విశ్వాసం ఉంచినట్లు ఈ సర్వే తేల్చింది. కాగా, భారత్ తర్వాతి స్థానంలో కెనడా ఉంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై 62శాతం మంది కెనడియన్లు విశ్వాసం ఉంచినట్లు సర్వేలో వెల్లడైంది.

మూడో స్థానంలో రష్యా

మూడో స్థానంలో రష్యా

ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ(58శాతం), రష్యా(58శాతం), జర్మనీ(55శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం.. బ్రెగ్జిట్ సంక్షోభంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బ్రిటన్ థెరిస్సా మే ప్రభుత్వంపై 41శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచారు. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25శాతం మంది ప్రజలు మాత్రమే నమ్మకం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఏ మేరకు?

ప్రస్తుత అధికార ప్రభుత్వం స్థిరంగా ఉండగలదో లేదో అనే దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. అంతేగాక, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజలను రక్షించగలదా? లేదా ప్రజల సేవలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందా? అనే అంశాలను కూడా ఈ ఓఈసీడీ సర్వే పరిగణలోకి తీసుకుంది.

English summary
Trust in government is vitally important. It serves as a driving force for a country's economic development, makes governmental decisions more effective and leads to greater compliance with regulations and the tax system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X