వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్

భారత వ్యతిరేకి, అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ సభ్యురారాలైన ఇల్హాన్ ఒమర్‌కు రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తివంతమైన హౌస్ ఫారెన్ అఫైర్స్(విదేశీ వ్యవహారాల) కమిటీ నుంచి తొలగించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత వ్యతిరేకి, అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ సభ్యురారాలైన ఇల్హాన్ ఒమర్‌కు రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తివంతమైన హౌస్ ఫారెన్ అఫైర్స్(విదేశీ వ్యవహారాల) కమిటీ నుంచి తొలగించారు. 2019లో ఆమె ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలు చూస్తే ఫారెన్ అఫైర్స్ కమిటీలో ఉండటానికి అర్హులు కారని రిపబ్లికన్ పార్టీ సభ్యులు గట్టిగా వాదించారు.

ఈ క్రమంలో జరిగిన ఓటింగ్‌లో ఇల్హాన్ ఒమర్‌కు వ్యతిరేకంగా 218 ఓట్లు రాగా, అనుకూలంగా 211 ఓట్లు వచ్చాయి. దీంతో ఇల్హాన్ అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించడం జరిగింది. అయితే, ఇల్హాన్ ను తొలగించడాన్ని డెమొక్రటిక్ పార్టీ తప్పు బట్టింది. రాజకీయ కక్షసాధింపు చర్యగా దీన్ని అభివర్ణించింది.

 India Hater US Congresswoman Ilhan Omar Ousted From Foreign Affairs Panel Over Israel Remarks

కాగా, ఓటింగ్ కు ముందు ఇల్హాన్ మాట్లాడుతూ.. తాను ఒక్కసారి ఈ కమిటీలో లేనంతమాత్రాన.. నా గళాన్ని, నాయకత్వాన్ని అణచివేయలేరు. అవి బిగ్గరగా మారతాయని అన్నారు. అయితే, ఒమర్ తరచూ యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ.. ఆధారాల్లేని వాదనలను బలపర్చడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండటంతో ఇల్హాన్ ను తొలగించారు.

మరోవైపు, ఇల్హాన్ భారతదేశానికి వ్యతిరేకంగానూ పలు చర్యలకు పాల్పడ్డారు. గత ఏడాది భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతినేలా ప్రవర్తించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించిన ఇల్హాన్.. ఈ సందర్భంగా కాశ్మీర్ పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలంటూ వ్యాఖ్యానించారు. అంతేగాక, ఇమ్రాన్ ఖాన్ తోనూ ఆమె భేటీ కావడాన్ని భారత్ తప్పుబట్టింది. భారత్ ప్రాదేశిక సమగ్రతను ఇల్హాన్ ఉల్లంఘించారని మనదేశ విదేశంగా శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇల్హాన్ తన వ్యక్తిగత హోదాలోనే అక్కడకు వెళ్లిన అనధికారిక పర్యటన అని పేర్కొంది. కాగా, ఇలాంటి చర్యలతో ఇల్హాన్ భారత వ్యతిరేకిగా మారిపోయారు.

English summary
'India Hater' US Congresswoman Ilhan Omar Ousted From Foreign Affairs Panel Over Israel Remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X