వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ది ఓ విజయగాథ: అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కొత్త మంత్రి బ్లింకెన్‌ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వలసదారులకు పెద్ద పీట వేస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇంకాసేపట్లో కేబినెట్ కూర్పు, కీలక నియామకాలు చేపట్టనున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బుధవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవంతిలో ప్రమాణస్వీకారాలు చేశారు. బైడెన్ బాధ్యతలు చేపట్టడానికి కొద్ది గంటల ముందే.. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఆయన ఎంచుకున్న ఆంటోనీ బ్లింకెన్.. భారత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -'ఫస్ట్ లేడీ'కి లవ్ ట్వీట్జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -'ఫస్ట్ లేడీ'కి లవ్ ట్వీట్

అమెరికాతో భారత్‌ కొనసాగిస్తున్న సంబంధాలపై ఆ దేశానికి కాబోయే విదేశాంగ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌ ప్రశంసలు కురిపించారు. ఏ పార్టీ అధికారంలో ఉందనే దానితో సంబంధం లేకుండా అమెరికాతో భారత్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోందని, ఈ విషయంలో భారత్‌ది ఓ విజయగాథగా చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

India is a bipartisan success story: Secretary of State-designate Antony Blinken

జోబైడెన్ నాయకత్వంలో భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య మైత్రి కొనసాగాలని బ్లింకిన్ ఆకాంక్షించారు. విదేశాంగ సెక్రటరీగా సెనేట్‌ కమిటీ ఆయనకు ఆమోదముద్ర వేసే ముందు ఆయన మాట్లాడుతూ భారత్‌పై తన దృక్పథాన్ని ఆవిష్కరించారు. ఒబామా హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయని గుర్తుచేశారు. సమాచార మార్పిడి, రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల విషయంలో కొత్త ఒప్పందాలు కుదిరాయన్నారు.

జామాత దశమగ్రహం! ట్రంప్ అల్లుడు అదుర్స్ -తండ్రి రిటైర్‌మెంట్.. కూతురు టిఫనీ ఎంగేజ్‌మెంట్జామాత దశమగ్రహం! ట్రంప్ అల్లుడు అదుర్స్ -తండ్రి రిటైర్‌మెంట్.. కూతురు టిఫనీ ఎంగేజ్‌మెంట్

ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని ఆవిష్కరిస్తూ ట్రంప్‌ అదే పరంపరను కొనసాగించారని, ప్రాంతీయంగా భారత్‌ సార్వభౌమాధికారంపై చైనా సహా ఇతర ఏ శక్తులు సవాల్‌ విసరకుండా కృషి చేస్తున్నామని, ఉగ్రవాద నిర్మూలనపైనా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని బ్లింకిన్ చెప్పారు. వాతావరణ మార్పుల అంశంలో పురోగతి సాధించాల్సి ఉందని, భారత ప్రధాని మోదీ పునరుత్పాదక ఇంధనం సహా ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

English summary
China presents the “most significant challenge” to the US whereas India has been a “bipartisan success story” with which the incoming Biden administration can deepen cooperation in many ways, Antony Blinken, the nominee for the post of secretary of state, has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X