వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ అత్యంత విశ్వసించదగిన భాగస్వామ్య దేశం: కమలా హ్యారిస్, సమన్వయం, సహకారం: మోడీ

|
Google Oneindia TeluguNews

అమెరికా టూర్‌లో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. టాప్ కంపెనీల సీఈవోలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ.. తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌తో సమావేశం అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. తర్వాత ఇరువురు కలిసి.. సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

 India is very important partner to US:Vice President Kamala Harris

భారతదేశం తమకు ముఖ్యమైన భాగస్వామ్య దేశం అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పిన ఆమె.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అమెరికాతో కలిసి భారత్ పనిచేసిందని ఇదీ తమకు గర్వకారణం అని అభిప్రాయపడ్డారు. ఇదీ మరచిపోలేం అని తెలిపారు. టీకా ఎగుమతి త్వరలో ప్రారంభిస్తామని భారత్ చెప్పడాన్ని స్వాగతించారు. అలాగే రోజుకు 10 మిలియన్ల మందికి టీకా ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు.

కరోనా సెకండ్ సమయంలో అమెరికా చేసిన సపోర్ట్ మరచిపోలేమని ప్రధాని మోడీ అన్నారు. ఈ మేరకు అగ్రరాజ్యానికి థాంక్స్ చెప్పారు. భారత్- అమెరికా పరస్పరం గౌరవించుకొని.. భౌగొళిక రాజకీయాలపై రెస్పెక్ట్ కలిగి ఉంటుందని చెప్పారు. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.

Recommended Video

విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

English summary
US Vice-President Kamala Harris said that India was a very important partner to US and that both the nations working together can have a profound impact on the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X