భారత్ జపాన్ బంధం ధృడమైంది.. ఉమ్మడి సంకల్పంతో కూడింది: మోడీ
ప్రధాని మోడీ రెండురోజుల జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. సోమవారం టోక్యోలో గల ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది అని చెప్పారు. 100వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు అడుగులు వేస్తుందని చెప్పారు. మరో 25 ఏళ్లలో దేశం మరింత ఉన్నత స్థితికి చేరుకోగలదని ఆకాంక్షించారు.

ఆజాదీ కా అమృత్ దేశ శ్రేయస్సు, విజయాల చరిత్రను లిఖించబోతుందని మోడీ పేర్కొన్నారు. తీర్మానాలు పెద్దవని తెలుసు.. కానీ 130 కోట్ల భారతీయుల్లో కనిపిస్తోన్న ఉత్సాహం.. విశ్వాసంతోనే భరోసాతో ముందడుగు వేశానని వివరించారు. అవీ నెరవేరుతాయని మోడీ అభిలషించారు. ఇవీ పెద్ద ప్రమాణాలు కానే కావని.. జీవితంలో పొందిన బోధనల వల్ల అలా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు.
భారత్-జపాన్ సహజ భాగస్వాములు అని మోడీ వివరించారు. దేశ అభివృద్దిలో జపాన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జపాన్‌తో సంబంధం సాన్నిహిత్యం, ఆధ్యాత్మికం, సహకారం, అనుబంధంతో కూడుకుందని వివరించారు. జపాన్‌తో బంధం గౌరవం, ప్రపంచం కోసం ఉమ్మడి సంకల్పంతో కూడుకుందని పేర్కొన్నారు. జపాన్‌తో సంబంధం బుద్దుడు, ధ్యానంతో కూడుకుందని పేర్కొన్నారు.