వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్‌లో మతఘర్షణలు: అమెరికా గూఢచర్య సంస్థ

|
Google Oneindia TeluguNews

మరో మూడునెలల సమయంలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మతఘర్షణలు జరిగే అవకాశం ఉందని అన్నారు అమెరికా గూఢచారి. అమెరికా చట్టప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన ఆయన అధికార బీజేపీ హిందూ భావజాలాన్ని పదేపదే ప్రస్తావిస్తే మతఘర్షణలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సార్వత్రిక ఎన్నికల వేళ మత ఘర్షణలు

సార్వత్రిక ఎన్నికల వేళ మత ఘర్షణలు

ఈ ఏడాది భారత దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ పదే పదే హిందూ భావజాలం ప్రజలపై రుద్దుతుండటంతో ఎన్నికల సమయంలో మతఘర్షణలు జరిగే అవకాశం ఉందని అమెరికా గూఢచారి సంస్థ డైరెక్టర్ డాన్ కోట్స్ హెచ్చరించారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే భయానక పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందో దానిపై అమెరికా సెనేట్‌కు ఓ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

 బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మతఘర్షణలు ఎక్కువ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మతఘర్షణలు ఎక్కువ


భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ భావజాలన్ని పెంచి పోషిస్తోందని ఇది ఇలానే కొనసాగితే భారత్‌లో మతకల్లోలాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సెనేట్‌కు డాన్ కోట్స్ వివరించారు. మోడీ తొలి ఐదేళ్ల పాలనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన ఆందోళనలు చాలా జరిగాయని ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందూ నాయకులు మతపరమైన భావజాలంను రుద్దే అవకాశం ఉండటం, తమ కార్యకర్తలను హింస జరిగేలా ప్రేరేపించే అవకాశం ఉందని డాన్ కోట్స్ వెల్లడించారు.

మతపరమైన ఆందోళనలతో ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం

మతపరమైన ఆందోళనలతో ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం

భారత్‌లో మతపరమైన ఆందోళనలు జరిగితే... భారత్‌లో ఉన్న ముస్లిం సామాజిక వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న డాన్ కోట్స్ అదే సమయంలో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడే ఛాన్సులున్నాయని డాన్‌కోట్స్ హెచ్చరించారు. అదే సమయంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలపై కూడా డాన్ కోట్స్ హెచ్చరించారు. భారత్‌లో ఎన్నికల వేళ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంతర్గతంగా కొన్ని అలజడిలు కూడా సృష్టించే అవకాశం ఉందని అన్నారు.

English summary
There is a strong possibility of communal violence in India if the ruling BJP stresses on Hindu nationalist themes ahead of the general election in May, America's top spymaster told US lawmakers on Tuesday.The comment on India's upcoming general election is part of the US intelligence community's assessment of worldwide threats in the year 2019 and was presented in the form of a written document to the powerful Senate Select Committee on Intelligence by Dan Coats, Director of National Intelligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X