వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను వెనక్కినెట్టిన టాప్‌లో నిలిచిన ఇండియా

ఫేస్‌బుక్‌కు అతిపెద్ద యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. అమెరికాను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని ఇండియా దక్కించుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌కు అతిపెద్ద యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. అమెరికాను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని ఇండియా దక్కించుకొంది.

ఫేస్‌బుక్‌కు 240 మిలియన్ యాక్టివ్ యూజర్లు అమెరికాలో ఉన్నారు. ఇండియాలో 241 మిలియన్ యాక్టివ్ యూజర్లున్నారని ఆ కంపెనీ ప్రకటించింది. ఫేస్‌బుక్ ఇటీవలే 2 బిలియన్ యూజర్లకు చేరుకొంది.

India overtakes US as Facebook’s No. 1 user

ఫేస్‌బుక్ 2 బిలియన్ యూజర్లకు చేరిన కొద్ది రోజులకే ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్ట్స్ వెబ్ గురువారం వెల్లడించింది.

అడ్వర్‌టైజర్ల కోసం సోషల్‌మీడియా దిగ్గజం గణాంకాలను ఈ పోర్టల్ విడుదల చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్ యాక్టివ్ యూజర్లు రెండింతలకు పైగా పెరుగుతున్నారని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గత ఆరుమాసాల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ది మాత్రమే కన్పించింది. ఎక్కువమంది యాక్టివ్ యూజర్లున్నప్పటికీ భారత్‌లో ఫేస్‌బుక్ వ్యాప్తి మాత్రం తక్కువగానే నమోదైంది.

జూన్ నెలలో మొత్తం జనాభాలో కేవలం 19 శాతం మంది ప్రజలే ఫేస్‌బుక్‌ను వాడారు. అంతేకాదు ఫేస్‌బుక్ వాడకంలోనూ లింగ అసమానత కన్పిస్తోంది. మూడు క్వార్టర్స్‌గానూ యాక్టివ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌లో పురుషులే ఆధిక్యంలో ఉన్నారు.

దీనికి భిన్నంగా అమెరికాలో 54శాతం మంది యాక్టివ్ యూజర్లు మహిళలే ఉన్నట్టు సమాచారం. భారత్‌లో ఫేస్‌బుక్ వాడుతున్న సగానికి పైగా యూజర్లు 25 ఏళ్ళలోపువారే.

English summary
India has overtaken the US to become Facebook’s largest country audience with a total 241 million active users, compared to 240 million in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X