వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ పై దాడికి భారత్ ప్లాన్.. చైనా ఇష్యూని డైవర్ట్ చేసేందుకే.. ఖురేషీ సంచలనం

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తగ్గకపోగా.. గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సుతోపాటు కొత్తగా దెప్సంగ్ బల్జె, దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్లలోనూ చైనా భారీగా సైన్యాలను మోహరిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో బయటపడటం కలవరపరుస్తున్నది. ఇదిలా ఉంటే, చైనాకు అత్యంత ఆప్తురాలైన పాకిస్తాన్ అదేపనిగా భారత్ పై విమర్శల తీవ్రత పెంచుతున్నది. ఈక్రమంలోనే పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం షాకింగ్ కామెంట్స్ చేశారు.

పరిస్థితి అలానే ఉంది..

పరిస్థితి అలానే ఉంది..

‘‘కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలను బట్టి మాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. చైనా విషయంలో అడుగడుగునా విఫలమైన భారత్.. ప్రజల దృష్టిని వేరేవైపు మళ్లించాలనుకుంటోంది. అందులో భాగంగా పాకిస్తాన్ పై మెరుపు దాడులకు ప్లాన్ సిద్ధం చేసింది. దానికి ఏదో ఒక సాకు చెప్పుకోవాలి కాబట్టి ముందుగా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులను తొలగించింది'' అంటూ ఖురేషీ నోరుపారేసుకున్నారు.

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు.. బ్రేక్ పడింది ఇందుకేనంటూ బాంబు పేల్చిన మంత్రి బాలినేనివైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు.. బ్రేక్ పడింది ఇందుకేనంటూ బాంబు పేల్చిన మంత్రి బాలినేని

అదే జరిగితే యుద్ధమే..

అదే జరిగితే యుద్ధమే..

చైనా చేతిలో భారత బలగాలు చనిపోయిన తర్వాత మోదీ సర్కారుపై ఒత్తిడి పెరిగిందని, దానికితోడు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ఎటూ పాలుపోని స్థితిలో జనం దృష్టిని మళ్లించడానికి భారత్.. పాక్ ను టార్గెట్ చేసుకుందని ఖురేషీ వ్యాఖ్యానించారు. భారత్ గనుక దాడికి దిగితే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోబోదని, ఈసారి పూర్తి యుద్ధానికి దిగుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఏకపక్ష విధానాల వల్లే దౌత్య సంబంధాలు కూడా దెబ్బతినే పరిస్థితి దాపురించిందన్నారు.

నిమ్మగడ్డ రహస్య భేటీపై బీజేపీ ట్విస్ట్.. సుజనా, కామినేనిపై పార్టీ స్టాండ్ ఇది.. రాత్రి కాదుగా అంటూ..నిమ్మగడ్డ రహస్య భేటీపై బీజేపీ ట్విస్ట్.. సుజనా, కామినేనిపై పార్టీ స్టాండ్ ఇది.. రాత్రి కాదుగా అంటూ..

చివరిసారిగా బాలాకోట్..

చివరిసారిగా బాలాకోట్..

ఉగ్రవాదుల కార్ఖానాగా కొనసాగుతోన్న పాకిస్తాన్.. ఫిదాయిల ద్వారా జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో నిత్యం అలజడుల సృష్టించేది. 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై భీకర దాడిలో 40 మంది జవాన్లు చనిపోవడానికి ప్రతీకారంగా భారత వాయుసేన.. పాకిస్తాన్ గడ్డమీదికి చొచ్చుకెళ్లి, బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించడం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎత్తేసిన తర్వాత ఉగ్రకలాపాలు క్రమంగా తగ్గుతూ రావడం విదితమే. అలాంటిది సడెన్ గా పాక్ మంత్రే భారత్ దాడికి ప్లాన్ చేసిందని చెప్పడంతో పాక్ మీడియా సైతం డంగైనట్లు తెలుస్తోంది.

రెండు వైపులా సిబ్బంది తగ్గింపు..

రెండు వైపులా సిబ్బంది తగ్గింపు..

గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు పాక్ హైకమిషనర్ కార్యాలయ సిబ్బందిపై భారత ప్రభుత్వం ఇటీవలే వేటు వేసింది. అంతలోనే ఇస్లామాబాద్ లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను హిట్ అండ్ రన్ కేసు పేరుతో పాక్ పోలీసులు టార్చర్ పెట్టారు. వరుస పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీలోని పాక్ ఎంబసీ సిబ్బంది సంఖ్యను 50 శాతానికి తగ్గిస్తూ.. అదే విధంగా ఇస్లామాబాద్ లోని మనవాళ్లలో 50 శాతం మందిని వెనక్కి వచ్చేయాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. భారత్ తన నిర్ణయాన్ని వెలువరించిన కొద్దిసేపటికే.. పాకిస్తాన్ ప్రభత్వం ఇస్లామాబాద్ లోని ఇండియన్ కమిషనర్ కు నోటీసులు పంపి నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ పై దాడికి దీన్ని కూడా ఓ సాకులా వాడుకోవాలని భారత్ చూస్తోందని ఖురేషీ అన్నారు.

Recommended Video

Vijay Devarakonda's Fighter Movie.. ఫారిన్ నుంచి Hyderabad కి
రెట్టింపైన డ్రగ్స్ సరఫరా..

రెట్టింపైన డ్రగ్స్ సరఫరా..

భారత్ ను అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న పాకిస్తాన్.. కరోనా విలయ కాలంలోనే భారీ కుట్రలకు పాల్పడిన తీరు వెల్లడైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం సరిహద్దు గుండా భారత్ లోకి మాదకద్రవ్యాల చేరవేత గతంలో కంటే 47 శాతం పెరిగింది. హెరాయిన్, గంజాయి తదిర పదార్థాలన్నీ కలిపి.. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ దాకా 4826కిలోల మాదకద్రవ్యాలను మన బలగాలు స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 15 దాకా ఏకంగా 6,886కిలోల సరుకును పట్టుకున్నట్లు తేలింది. సాధారణంగా న్యూఇయర్ సమయంలో డ్రగ్స్ చేరవేత యాక్టివిటీలు ఎక్కువగా ఉంటాయని, అలాంటిది ఈసారి ప్రధమార్థంలోనే భారీగా పట్టుపడ్డాయని అధికారులు చెప్పారు. ఆ డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుందన్న విషయం తెలిసిందే.

English summary
Pakistan Foreign Minister warned India to refrain from launching any attacks on Pakistan, saying that it would respond with full force if New Delhi embarks on any misadventure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X