వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంక్షలతో మొదటికే మోసం: భారత్ పై ఆంక్షల విషయంలో యోచిస్తున్న అమెరికా

|
Google Oneindia TeluguNews

భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ రష్యాలు పలు రక్షణ ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఐదు యూనిట్ల ఎస్-400 మిస్సైల్‌ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అమెరికా రంగంలోకి దిగింది. రష్యాతో భారత్ తెగదెంపులు చేసుకోవాలని సూచిస్తోంది. రష్యాతో లావాదేవీలు రద్దు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది అగ్రరాజ్యం అమెరికా.

Recommended Video

US Threatens Sanctions Ahead Of India-Russia Missile Systems Deal
 క్యాట్సా చట్టం తీసుకొచ్చిన అమెరికా

క్యాట్సా చట్టం తీసుకొచ్చిన అమెరికా

అమెరికాకు బద్ధ శత్రువులైన పలుదేశాలతో అమెరికా మిత్రదేశాలు ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకూడదని తెలుపుతూ అమెరికా ప్రభుత్వం కౌంటరింగ్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (క్యాట్సా) పేరుతో ఓ చట్టాన్ని రూపొందించింది. ఇక అమెరికా శతృదేశాలైనా ఇరాన్, ఉత్తరకొరియా, రష్యాలతో విస్తృతంగా వాణిజ్యం వ్యాపారాలు నిర్వహించరాదని అమెరికా తమ మిత్రదేశాలపై ఆంక్షలు విధించింది. రష్యా నుంచి చమురు, సహజ వాయు పరిశ్రమ, రక్షణ, భద్రతా రంగాలను ఆంక్షలకు లక్ష్యంగా ఎంచుకుంది.

రష్యా మిసైల్స్ ఒప్పందం: ఆంక్షలు తప్పవంటూ భారత్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్రష్యా మిసైల్స్ ఒప్పందం: ఆంక్షలు తప్పవంటూ భారత్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

 ఎస్-400 మిస్సైల్ కొనుగోలుకు ఒప్పందం

ఎస్-400 మిస్సైల్ కొనుగోలుకు ఒప్పందం

భారత రక్షణ వ్యవస్థలో ఉన్న అత్యధిక ఆయుధాలు రష్యా నుంచి కొనుగోలు చేసినవే కావడం, డిఫెన్స్ పార్ట్‌నర్‌గా రష్యా ఒక్కదేశంతోనే సత్సంబంధాలను భారత్ నెరుపుతోంది. ఈ క్రమంలోనే రష్యా నుంచి ఎస్-400 మిస్సైల్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్‌ను హెచ్చరిస్తోంది. అయితే ఇదే విషయమై మోడీ సర్కార్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులు గత కొద్దిరోజులుగా అమెరికా ప్రభుత్వంతో ఆంక్షలు ఎత్తివేయాల్సిందిగా కోరుతూ చర్చలు జరుపుతున్నారు. ఒక్క రష్యా నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.

 అమెరికాహెచ్చరికలను సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

అమెరికాహెచ్చరికలను సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

మిలియన్ డాలర్ల విలువైన ఎస్-400 రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో అమెరికా తాజా హెచ్చరికలు చేసింది. ‘క్యాట్సా' పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపైనా ఆంక్షలు ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ మిత్ర పక్షాలను, భాగస్వామ్య దేశాలను ఈ విషయంలో మరోమారు ఆలోచించాల్సిందిగా కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు విశ్లేషకులు మాత్రం అమెరికా హెచ్చరికలను కొట్టిపడేశారు. ఎస్-400 విషయంలో భారత్ ముందుకెళ్లినా అమెరికా చేసేదేమీ ఉండదని, ప్రకటనలకు, హెచ్చరికలకే అది పరిమితమవుతుందని చెబుతున్నారు.

భారత్‌పై ఆంక్షలు విధిస్తే అమెరికాకే నష్టం

భారత్‌పై ఆంక్షలు విధిస్తే అమెరికాకే నష్టం


రష్యాతో భారత్ సంబంధాలకు సంబంధించి ఆంక్షలు ఎత్తివేయాలని గతకొద్దిరోజులుగా భారత ఉన్నతాధికారులు అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై అమెరికా కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రష్యాతో భారత్ సంబంధాలపై అమెరికా అడ్డు తగిలితే భారత్ అమెరికాల మధ్య ఉన్న మంచి సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని భావిస్తోంది. ఇలా జరిగితే పొరుగు దేశమైన చైనాతో పాటు రష్యాతో భారత్ సత్సంబంధాలు బలపడే అవకాశం ఉందని అగ్రరాజ్యం యోచిస్తోంది.

English summary
The Narendra Modi government has conveyed to the Trump administration that India is a fit case for a presidential waiver from the provisions of Countering America’s Adversaries Through Sanctions Act (CATSA) on Russiadue to the legacy military relationship between New Delhi and Moscow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X