చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ - పుతిన్ భేటీ: చెన్నై నుంచి వ్లాదివోస్తాక్‌కు సముద్రమార్గం ప్రతిపాదించిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు రంగాల్లో 25 ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా సంయుక్త మీడియా సమావేశంలో ఇరుదేశాధినేతలు మాట్లాడారు. భారత్‌లో మరో 20 అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణంను చేపడుతామని పుతిన్ తెలిపారు. మాస్కో మహా యుద్ధంలో విజయం సాధించి 75 ఏళ్లు నిండిన సందర్భంలో 2020 మేనెలలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మోడీని ఆహ్వానించారు పుతిన్. పుతిన్ ఆహ్వానించడంతో తప్పకుండా వస్తాను అని మోడీ మాట ఇచ్చారు. దీంతో పుతిన్ మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామని తెలిపారు పుతిన్

 వ్లాదివోస్తాక్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ

వ్లాదివోస్తాక్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు. వ్లాడివోస్తాక్‌కు తనను ఆహ్వానించినందుకు ముందుగా పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. వ్లాదివోస్తాక్‌ నగరంలో పర్యటించిన భారత ప్రధానుల్లో తొలి ప్రధానిగా మోడీ రికార్డు నెలకొల్పారు. రష్యా భారత్‌ల మధ్య స్నేహంతో రెండు దేశాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం కేవలం రాజధానుల వరకు మాత్రమే పరిమితం కాలేదన్న ప్రధాని... ప్రతి చోటా ఇరు దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు.

ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాలివే..ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాలివే..

 అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

అంతరిక్షరంగంలో భారత్ రష్యా దేశాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ముందుకెళుతున్నాయని మోడీ ప్రశంసించారు. ఇక రెండు దేశాల మధ్య అంతరిక్షరంగంలో ఒప్పందం జరగడంతో వ్యూహాత్మకంగా ఈ రంగంలో అడుగులు ముందుకు పడతాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో ఇరుదేశాలు కలిసి కొత్త అధ్యాయం లిఖిస్తాయని మోడీ చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా భారత వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇస్తుంది. ఇక చెన్నై - వ్లాడివోస్తాక్‌ల మధ్య శాశ్వత పద్ధతిన సముద్రమార్గం ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు ప్రధాని మోడీ.

దేశాల అంతర్గత విషయాల్లో మరొకరి జోక్యం తగదు

దేశాల అంతర్గత విషయాల్లో మరొకరి జోక్యం తగదు

భారత్ - రష్యాలు పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు ప్రధాని మోడీ. బ్రిక్స్, ఎస్‌సీఓ సమాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ఇక రెండు దేశాల అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం ఉండదని, ఇందుకు రెండు దేశాలు వ్యతిరేకమని మోడీ చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఉద్దేశిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 రష్యా అత్యున్నత పౌరపురస్కారంపై ధన్యవాదాలు తెలిపిన మోడీ

రష్యా అత్యున్నత పౌరపురస్కారంపై ధన్యవాదాలు తెలిపిన మోడీ


ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంకు తనను ఆహ్వానించినందుకు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆహ్వానాన్ని అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య ఒక కొత్త రూపం ఈ చారిత్రాత్మక సందర్భం ద్వారా సంతరించుకుంటుందని చెప్పారు. ఇక రష్యా అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని మోడీకి ప్రకటించడంపూ ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ అరుదైన పురస్కారం దక్కడాన్ని రెండు దేశాల ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తానని మోడీ చెప్పారు. 1.3 బిలియన్ కోట్లు భారతీయులకు దక్కిన గౌరవం అని మోడీ చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుతిన్‌ను తొలిసారిగా కలిసినట్లు చెప్పిన ప్రధాని మోడీ.. ఈ సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని చెప్పారు. అంతేకాదు గత 20 ఏళ్లుగా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయని చెప్పారు.

English summary
PM Modi is on a two-day visit to Russia during which he will hold summit talks with the Russian president Vladimir Putin and attend the Eastern Economic Forum in Vladivostok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X