వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహం కొనసాగాలి: పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ

|
Google Oneindia TeluguNews

సోచీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రష్యాలో పర్యటించారు. సోమవారం ఉదయం రష్యాలోని సోచీ చేరుకున్న ప్రధాని మోడీకి.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం నరేంద్ర మోడీ, పుతిన్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్‌, రష్యా బంధం చాలా ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పారు. సోచీకి ఆహ్వానించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 India, Russia have been friends for a long time, says PM Modi

ఎస్‌ఓసీలో భారత్‌కు శాశ్వత సభ్యత్యం వచ్చేందుకు రష్యా ఎంతగానో సహకరించిందన్నారు. ఇరు దేశాల మధ్య బంధం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

కాగా, భేటీ అనధికారికమని ఇరు దేశాలు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అనధికార పర్యటనలో సమావేశమయ్యారు.

English summary
Prime Minister Narendra Modi arrived in Sochi on Monday held a meeting with Russian President Vladimir Putin, as part of an informal summit between the two nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X