వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో మాటల యుద్ధం: ఇండియన్ ఆర్మీ డేంజరస్ మూవ్: మా వాళ్లు మంచోళ్లు: చైనా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ చోటు చేసుకున్న కాల్పుల ఉదంతం.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రెండు దేశాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమైంది. కాల్పుల ఉదంతంపై చైనా అతిగా స్పందిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వాస్తవాధీన రేఖను దాటుకుని తరచూ భారత భూభాగంపైకి దూసుకొచ్చిన చరిత్ర ఉన్న చైనా సైనిక బలగాలు.. భారత్‌పై వ్యూహాత్మకంగా దాడి చేస్తోందని అంటున్నారు. కాల్పులకు చైనా కారణమంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన ప్రకటనను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చుతోంది.

చైనా సైనికుల తెంపరితనం: ఆ రాత్రి ఏం జరిగిందంటే: సరిహద్దుల్లో కాల్పులపై ఆర్మీ కీలక ప్రకటనచైనా సైనికుల తెంపరితనం: ఆ రాత్రి ఏం జరిగిందంటే: సరిహద్దుల్లో కాల్పులపై ఆర్మీ కీలక ప్రకటన

తప్పంతా భారత్‌దే

తప్పంతా భారత్‌దే


వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్‌పాయ్ పర్వతంపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత.. ఈ కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జవాన్లు.. తమదేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టామని, దీనికోసం వార్నింగ్ షాట్ ఫైరింగ్ చేయాల్సి వచ్చిందంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన ప్రకటనను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. ఇందులో తమ ప్రమేయం ఏదీ లేదని, భారత జవాన్లు ఉద్దేశపూరకంగా తమ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని పేర్కొంది.

 ఒప్పందాలకు తూట్లు..

ఒప్పందాలకు తూట్లు..


ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఝావో లీజియన్ పేరు మీద ఓ ప్రకటన వెలువడింది. భారత జవాన్ల ప్రవర్తన ఆ దేశ దుందుడుకు వైఖరికి అద్ద పండుతోందని లీజియన్ ఆరోపించారు. రెండు దేశాల మధ్య కుదరిన ఒప్పందాలను భారత్.. యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. సైనిక చర్యల ద్వారా తమ దేశ భద్రతా బలగాలను రెచ్చగొట్టడానికి భారత్ ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని అన్నారు. భారత సైనికుల చర్యలు తాము అత్యంత ప్రమాదకరమైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఫ్రంట్‌లైన్ పొజిషన్ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలంటూ..

ఫ్రంట్‌లైన్ పొజిషన్ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలంటూ..


సరిహద్దుల్లో పహారా కాస్తోన్న తమ దేశ ఫ్రంట్‌లైన్ పొజిషన్ బలగాలను భారత్.. అదుపులో ఉంచుకోవాలని కోరుతున్నట్లు ఝావో లీజియన్ పేర్కొన్నారు. వారిని వెంటనే వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దౌత్యపరంగా, రక్షణ ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి తాము సదా సిద్ధంగా ఉంటామని, అనవసరంగా రెచ్చగొట్టే పనులను మానుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. ఇకముందు ఇలాంటివి పునావృతం కావని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Recommended Video

India-China Stand Off : China ప్రకటనను తిప్పి కొట్టిన Indian Army అధికారులు!
 పెట్రోలింగ్ సైన్యంపై అకారణంగా కాల్పులు..

పెట్రోలింగ్ సైన్యంపై అకారణంగా కాల్పులు..

సరిహద్దుల్లో పెట్రోలింగ్‌లో ఉన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలపై భారత్ ముందుగా కాల్పులు జరిపిందని, దీనికి భిన్నమైన ప్రకటన వెలువడిందని ఆయన చెప్పారు. భారత జవాన్లు వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు పాల్పడగా.. చైనా జవాన్లు సంయమనంతో వ్యవహరించారని అన్నారు. పరిస్థితులు అదుపు చేయడానికి చైనా పీఎల్ఏ బలగాలు గాల్లోకి కాల్పులు చేశారని వివరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి నియంత్రణలో ఉందని చెప్పుకొచ్చారు. భారత సైనికుల చర్యలు అత్యంత ప్రమాదరకంగా పరిణమించాయని, వాటిని అదుపు చేయాలని ఝావో లిజియన్ సూచించారు.

English summary
China Foreign Ministry says on 7 September incident at LAC that Indian troops illegally crossed LAC and entered south bank of Pangong Tso. Indian troops blatantly fired warning shots at our border patrolling troops who were there for consultation, China Foreign Ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X