హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లండన్‌లోని నిజాం నిధులు: కోర్టులో పాక్‌పై గెలిచిన భారత్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లండన్లోని బ్యాంకులో ఉన్న నిజామ్ నవాబుల కాలానికి చెందిన నిధులు ( నగదు) భారత్ ఆస్తి అని లండన్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నిధులకు పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని లండన్ ఉన్నత న్యాయస్థానం సంచలమైన తీర్పు చెప్పింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో నిజామ్ కాలం నాటి రూ. 322 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.

ఆ డిపాజిట్లను భారత్ కు తీసుకురావడానికి అధికారులు సిద్దం అవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్, పాకిస్థాన్ విదేశాలలో ఈ ఆస్తి మాదే అంటే లేదు మాదే అని ఇన్ని సంవత్సరాలు న్యాయపోరాటం చేశాయి. చివరికి భారతదేశానికి విజయం వరించింది.

ఇదీ జరిగింది, అప్పటి నుండి కేసు విచారణ

India's chances to recover Nizam's funds brighten

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒక సంవత్సరం తరువాత హైదరాబాద్ నిజామ్ నవాబులు నగదు విదేశాలలో డిపాజిట్లు చెయ్యాలని నిర్ణయించారు. 1948 సెప్టంబర్ 20వ తేదీన అప్పటి నిజామ్ నవాబు హైదరాబాద్ నుండి బ్రిటన్ రాయబారి కార్యాలయానికి 10 లక్షల పౌండ్లను బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశారు.

హైదరాబాద్ నుండి లండన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకు ద్యారా ఈ లావాదేవీలు జరిగాయి. తరువాత హైదరాబాద్ నిజామ్ నవాబుల పరిపాలన ముగియడం, హైదారాబాద్ భారత్‌లో కలిసిపోయింది. అప్పడే పాకిస్థాన్ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. లండన్ లోని బ్యాంకులో ఉన్న నగదు మీద కన్ను వేసి కోర్టును ఆశ్రయించింది.

1960వ సంవత్సరంలో భారత్ ప్రభుత్వం లండన్ లోని బ్యాంకులో ఉన్న నగదు భారత్ కు తీసుకు రావడానికి ప్రయత్నించింది. లండన్ లో ఉన్న సోమ్ము తనకే రావాలని పాక్ పట్టబట్టింది. లండన్ లోని ఏ కోర్టులో అయినా విచారణ జరిపించడానికి తనకు అభ్యంతరం లేదని పాకిస్థాన్ న్యాయస్థానం ముందు చెప్పింది. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతున్నది.

భారత ప్రభుత్వం ఈ విషయంలో న్యాయపోరాటం చేసింది. వాదనలు పూర్తి కావడంతో రెండు రోజుల క్రితం లండన్ హైకోర్టు బ్యాంకులో ఉన్న నిజామ్ నవాబులు నిధులు హైదరాబాద్ కు చెందుతుందని తీర్పు వెల్లడించింది.

English summary
The 67-year-old Indo-Pak Hyderabad Funds saga has taken another turn with London's High Court of Justice ruling that Pakistan no longer has sovereign immunity over the State of Hyderabad's wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X