వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాస్ డాటర్: కల్పిత కథ కాదు, బ్యాన్ ఎత్తివేయాలన్న ఫ్రిదా పింటో

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' పైన హాలీవుడ్ నటి ఫ్రిదా పింటో స్పందించారు. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని యూకేలో విడుదల చేశారు. ఫిల్మ్ మేకరు లెస్సీ ఉడ్విన్ అమెరికాలో కూడా దీనిని స్క్రీన్ పైకి తీసుకు రావాలని నిర్ణయించారు. మరోవైపు, భారత దేశంలో దీని పైన ప్రభుత్వం నిషేధం విధించింది.

అమెరికాలో స్క్రీనింగ్ కార్యక్రమానికి ఫ్రిదా పింటో, మెరిల్ స్ట్రీప్ హాజరయ్యారు. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ చూసిన అనంతరం ప్రింటో స్పందించారు. ఇలాంటి డాక్యుమెంటరీని అందరికీ చూపించాలని విజ్ఞప్తి చేశారు.

India's Daughter: Actress Freida Pinto wants ban on documentary to be lifted

బీబీసీతో ఫ్రిదా పింటో మాట్లాడారు. ఇక్కడ రేప్ మాత్రమే అసలు సమస్య కాదని, వారి మైండ్ సెట్ కూడా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది మైండ్ సెట్ మార్చడానికి అన్నారు. ఇలాంటి వాటిని చూపించడం ద్వారా మైండ్ సెట్ మార్చవచ్చునని అభిప్రాయపడ్డారు.

ఇది కల్పిత గాథ కాదన్నారు. డాక్యుమెంటరీలో ఉన్నవన్నీ నిజాలని చెప్పారు. దానిని మనం తయారు చేయలేదని చెప్పారు. ఇండియాస్ డాక్యుమెంటరీ పైన బ్యాన్ ఎత్తివేయాలన్నారు. బ్యాన్ ఎత్తి వేసి.. చూస్తారా లేదా అనే విషయం ప్రజలకు వదిలేయాన్నారు.

English summary
After the BBC documentary 'India's Daughter' was screened in UK, filmmaker Lesee Udwin decided to screen the film in the US despite a ban imposed on it by the Indian government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X