వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కార్పొరేట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రెగ్యూలేటరీ అనిశ్చితి కారణంగా కొన్ని నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు బలహీనపడ్డాయని.. అయితే, తాము అనుకున్న దానికన్నా భారత ఆర్థిక వృద్ధిరేటు చాలా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. తమ అంచనాల కంటే చాలా తక్కువ స్థాయిలో వృద్ధి సాధించిందని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గెర్రీ రైస్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం భారత ఆర్థిక వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టంగా ఉంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోలో 5శాతంగా వృద్ధి రేటు నమోదైంది. కాగా, గత ఆర్థిక సంత్సరం ఈ కాలానికి 8శాతం వృద్ధిరేటు ఉండటం గమనార్హం.

Indias economic growth is much weaker than expected: IMF

2019, 2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు నెమ్మదిస్తుందని, ఈ రెండు సంవత్సరాల్లో కూడా 0.3శాతం తక్కువగా జీడీపీ ఉంటుందని జులై నెలలో అంచనా వేసింది. వరుసగా ఈ రెండేళ్లలో 7శాతం, 7.2శాతం ఉంటుందని పేర్కొంది. అయితే, ఐఎంఎఫ్ అంచనాల కంటే కూడా భారత్ తక్కువ వృద్ధిరేటును నమోదు చేసింది.

వృద్ధి రేటు నెమ్మదించడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని గెర్రీ రైస్ అన్నారు.
అయినా కూడా చైనా తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశంగా భారతదేశమే ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ఆర్థిక పరిస్థితిని ఐఎంఎఫ్ ఎప్పటికప్పుడు గమనిస్తోందని చెప్పారు.

English summary
International Monetary Fund (IMF) on Thursday said that India's economic growth is "much weaker" than expected due to corporate and environmental regulatory uncertainty and "lingering weakness" in some non-Bank financial companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X