వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా తోకా వంకరే: మరోసారి భారత్‌పై అక్కసు చాటుకుంది

భారత్‌పై చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌(ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం సాధించేందుకు భారత్‌ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటూనే ఉంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: భారత్‌పై చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌(ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం సాధించేందుకు భారత్‌ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ విషయంలో భారత్‌కు మద్దతివ్వబోమని చెప్పిన చైనా.. తాజాగా మరోసారి ఆ నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది.

తాజా పరిణామాల మధ్య ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం సంక్షిష్టంగా మారిందనిచైనా పేర్కొంది. దీంతో ఇప్పటికి కూడా తాము భారత్‌కు మద్దతివ్వలేమని చైనా స్పష్టం చేసినట్లయింది. దయాది దేశం పాకిస్థాన్‌కు మిత్రదేశంగా ఉంటున్న చైనా.. ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, మనదేశానికి అంతర్జాతీయ అడ్డంకులను సృష్టిస్తుండటం గమనార్హం.

India's NSG bid has become 'more complicated': China

'గతంలో ఊహించిన దానికంటే.. ఎన్‌ఎస్‌జీలో చేరడం ఇప్పుడు మరింతసంక్లిష్టంగా మారింది. కొత్త విధానాలు, కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో భారత్‌కు కాస్త కష్టమే' అని చైనా విదేశీ వ్యవహారాల అసిస్టెంట్‌ మినిస్టర్‌ లి హుయ్‌లయ్‌ పేర్కొన్నారు.

మరోవైపు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి పాకిస్థాన్‌ కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే పాక్‌కు మద్దతిస్తున్నట్లు చైనా ప్రకటించలేదు కానీ, భారత్‌పై మాత్రం వ్యతిరేకత ప్రదర్శిస్తూనే వస్తోంది.

జూన్ నెలలోనే ఎన్‌ఎస్‌జీ సమావేశం జరగనున్న నేపథ్యంలోచైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. భారత్‌కు మద్దతివ్వబోదని మరోసారి స్పష్టమైంది. అయితే ఈ విషయంపై చైనాతో చర్చలు జరుపుతామని కేంద్ర విదేశాంగమంత్రి సుస్మాస్వరాజ్‌ చెబుతున్నారు. మరోవైపు కజకిస్థాన్‌లో జరిగే సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోడీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

English summary
China on Monday said India's membership bid in the NSG has become "more complicated" under the "new circumstances" as it again ruled out backing New Delhi's entry in the grouping, saying there should be non-discriminatory solution applicable to all non-NPT signatory countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X