వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా వస్తువులపై పన్ను పోటు సరికాదన్న ట్రంప్, రేపు మోడీతో భేటీ నేపథ్యంలో హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఒసాకా : మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కాబోతున్నారు. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సమావేశంలో శుక్రవారం భేటీ కానున్నారు. అయితే భేటీకి ముందు ట్రంప్ బాంబు పేల్చారు. ఇటీవల అమెరికా వస్తువులపై భారత్ దిగుమతి సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. ఇది సరికాదని కామెంట్ చేయడం .. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది.

25 వస్తువులపై పన్ను
అమెరికా నుంచి భారత్ దిగుమతి అయ్యే 25 వస్తువులపై ఇండియా పన్ను పోటు పొడిచింది. దీంతో అమెరికా ఆదాయానికి భారీగా గండిపడనుంది. భారత్ ఎగుమతి చేసే వస్తువులకు అమెరికా కూడా పన్ను విధించింది. దీంతోపాటు ప్రాధాన్య వాణిజ్య హోదా నుంచి భారత్‌ను తొలగించిన నేపథ్యంలో భారత్ పన్ను విధిస్తున్నట్టు స్పష్టంచేసింది. స్టీల్, అల్యూమినియం అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. గతేడాది మార్చి నుంచి వీటిపై ట్యాక్స్ విధిస్తోంది అమెరికా. అయినప్పటికీ భారత్ ఊరుకుంది. జీఎస్పీ కార్యక్రమం నుంచి కూడా భారత్‌‌ను అమెరికా తొలగించింది. దీంతో ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని స్పష్టంచేసింది. 25 ఉత్పత్తులపై ఈ నెల 16 నుంచి ట్యాక్స్ వసూల్ చేస్తుంది. ఆ ఉత్పత్తుల్లో బాదం, వాల్ నట్స్, కాయ తదితర వస్తువులు ఉన్నాయి.

Indias tariffs unacceptable: Donald Trump lashes out ahead of meeting PM Modi at G20 Summit

సరికాదు ..
దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. అమెరికా వస్తువులపై భారత్ పన్ను విధించడం సరికాదన్నారు. తాము విధిస్తున్న పన్ను వెనక్కి తీసుకోవాలని కోరారు. శుక్రవారం మోడీతో సమావేశం కానున్న నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ ప్రాధాన్యం కలిగించాయి. నిన్న భారత పర్యటకొచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది.

English summary
Ahead of meeting Prime Minister Narendra Modi on the sidelines of the G20 Summit, US President Donald Trump has hit out at the Modi government and said that India's tariffs on US products is "unacceptable" and they must be withdrawn. Significant tension has grown between India and the US after Trump announced end of preferential trade with India and the Modi government hit back with retaliatory tariffs on 25 US products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X