వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టంపై ఇండియాకు టెన్షన్ ... ఐరాస దృష్టికి ... రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

చైనా పార్లమెంటు హాంకాంగ్ పై ఆధిపత్యం కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. హాంకాంగ్ పౌ పట్టు సాధించింది. అయితే ఈ చట్టంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అసలు ఎందుకు ఇండియా చైనా ఆమోదం తెలిపిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంది అంటే అందుకు కారణం లేకపోలేదు .

వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించి భారత్ కు షాక్

వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించి భారత్ కు షాక్

డ్రాగన్ కంట్రీ చైనా హాంకాంగ్ కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించి భారత్ కు కూడా షాక్ ఇచ్చింది. ఒకపక్క ఇండియా చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న సమయంలోనే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకోవటంలో కూడా లింక్ ఉంది. అదేంటి అంటే హాంకాంగ్ లో భారతీయలు అత్యధికంగా ఉంటున్నారు. అలాంటి చోట వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిపై నిరంకుశంగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత్ పై పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న వేళ భారతీయులను వేధింపులకు గురి చేసే ఆస్కారం కూడా లేకపోలేదు.

హాంకాంగ్ లో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

హాంకాంగ్ లో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం ప్రకారం చైనా పట్ల హాంకాంగ్ లో ఎటువంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా కఠిన శిక్షలు ఉంటాయి. అలాంటప్పుడు డ్రాగన్ కంట్రీ కాఆలనే తమ ఇండియన్స్ ను వేధించే అవకాశం లేకపోలేదు.చైనా తీసుకున్న వివాదాస్పద నిర్ణయం హాంకాంగ్ వాసులకే కాదు,హాంకాంగ్ లో నివసిస్తున్న వివిధ దేశాల ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. హాంకాంగ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం హాంకాంగ్ లో 38 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారని తెలుస్తుంది.

ఐక్యరాజ్యసమితి దృష్టికి ఇండియా పలు కీలక విషయాలు

ఐక్యరాజ్యసమితి దృష్టికి ఇండియా పలు కీలక విషయాలు

ఈ నేపథ్యంలో హాంకాంగ్ లో నెలకొన్న తాజా పరిస్థితుల పట్ల తీవ్రంగా దృష్టి సారించాలని ఇండియా ఐక్యరాజ్యసమితిని కోరింది. ఈ వ్యవహారంలో ఐక్య రాజ్యసమితి జోక్యం అవసరం అని పేర్కొంది. హాంకాంగ్ లో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని ఐరాస లోని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి కూడా అయిన రాజీవ్.కె.చందర్ గుర్తుచేశారు . డ్రాగన్ కంట్రీ చేస్తున్నచర్యల వల్ల ముఖ్యంగా హాంకాంగ్ స్వేఛ్చ, ప్రతిపత్తి హరించుకుపోతాయని భయపడుతున్నామని రాజీవ్ కె.చందర్ అంటున్నారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా తాము గమనిస్తున్నట్టు పేర్కొన్నారు. సంబంధిత పక్షాలు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని అభ్యర్థించారు .

Recommended Video

చైనా జలాంతర్గాములను Track చేయడానికి Andaman Port ను ఆ దేశ నావికాదళాల కోసం తెరవాలి- Chinoy
భారతీయుల అణచివేతకు ఈ చట్టం వినియోగిస్తే ?

భారతీయుల అణచివేతకు ఈ చట్టం వినియోగిస్తే ?

తమను విమర్శించే వారిని అణగదొక్కటం కోసం తాజాగా ఆమోదించిన వివాదాస్పద హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టాన్ని వినియోగించవచ్చని అనుమానిస్తున్నారు. ఒక్క ఇండియా మాత్రమే కాకుండా అమెరికా, ఈ యు, బ్రిటన్ తదితర దేశాలు కూడా హాంకాంగ్ లో నివసిస్తున్న తమ వారి సేఫ్టీ పై ఆందోళన చెందుతున్నారు. ఇతర దేశాల వాళ్ళతో పనిచేసినా, ఎవరు తమను వ్యతిరేకించినా, లేదా నిరసన గళం వినిపించినా కఠినమైన చట్టాలు అమలయ్యే విధంగా తీసుకున్న నిర్ణయంతో ఎవరైనా పొరపాటున చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే యావజ్జీవ ఖైదు పడే అవకాశముంది. ఇక ఈ నేపథ్యంలోనే హాంకాంగ్ ఈ విషయంలో చైనా తీసుకువచ్చిన చట్టం అత్యంత ప్రమాదకరంగా ఉందని, మానవుల హక్కుల ను ఉల్లంఘిస్తోందని పరిస్థితి మరింత సీరియస్ అయ్యేలా చేస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

English summary
China has passed a controversial security law over Hong Kong. India has urged the United Nations to look seriously at China's ratification of Hong Kong. The Countries requested that the United Nations needs intervention. A large number of Indians were in Hong Kong so , india is worrying about them and complained to united nations .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X