• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

UNSC : పాకిస్తాన్‌కే కాదు.. అక్కడి జర్నలిస్ట్‌కు కూడా భారత్ స్నేహహస్తం..!! ఆసక్తికర పరిణామం..!!

|

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్గత సమావేశం అనంతరం ఐక్యరాజ్యసమితి భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, పాకిస్తాన్ జర్నలిస్టులకు మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సంబంధించిన క్లోజ్డ్ డోర్ సమావేశం తరువాత మీడియా సమావేశంలో భారత రాయబారి పాకిస్తాన్ జర్నలిస్టుకు షేక్ హ్యాండ్ ఇచ్చి స్నేహ హస్తాన్ని విస్తరించే సంకేతాన్నిచ్చారు .

చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం .. ఆయన ఇల్లు ఉంటే ఏంటి..పోతే ఏంటి..మంత్రి కొడాలి నానీ షాకింగ్ కామెంట్స్

 పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఐక్యరాజ్యసమితి భారత రాయబారి

పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఐక్యరాజ్యసమితి భారత రాయబారి

ఐక్యరాజ్యసమితి భారత రాయబారి మరియు శాశ్వత ప్రతినిధి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా అంతం చేయాలన్న ఢిల్లీ చర్య ఆర్టికల్ 370 రద్దును గురించి ఐరాస సమావేశంలో జాతీయ స్థాయిలో కాశ్మీర్ కు సంబంధించిన వ్యవహారం పూర్తిగా భారతదేశం యొక్క అంతర్గత విషయమని పేర్కొన్నారు. ఆ తరువాత నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా పాకిస్థాన్ ప్రతినిధులు ముందుగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అక్బరుద్దీన్ మొదటి ముగ్గురు పాకిస్థానీ జర్నలిస్ట్ లను ఉద్దేశించి ప్రశ్నలు సంధించాల్సిందిగా కోరారు. దీంతో ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ మీరెప్పుడు పాకిస్థాన్ తో సంభాషణ ప్రారంభిస్తారు అని ప్రశ్నించారు.వెంటనే పోడియం నుండి వైదొలిగిన అక్బరుద్దీన్ సదరు పాకిస్తాన్ సీనియర్ రిపోర్టర్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

 స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించిన భారత రాయబారి చర్య

స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించిన భారత రాయబారి చర్య

ఆ తరువాత నేను మీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ప్రారంభిస్తాను అని చెప్పి మరో ఇద్దరు పాకిస్తాన్ జర్నలిస్టులతో కరచాలనం చేశారు అక్బరుద్దీన్ .అగ్ర దౌత్యవేత్త యొక్క చర్య అక్కడ గదిలో ఉన్న వారందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించింది. నుండి తిరిగి పోడియం వద్దకు వెళుతూ మాట్లాడిన అక్బరుద్దీన్ సిమ్లా ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా మేము ఇప్పటికే మా స్నేహ హస్తాన్ని అందించామని పాకిస్తాన్ వైపు నుండి ప్రతి స్పందన కోసం వేచి చూద్దామని ఉన్నారు.

మేమెప్పుడూ స్నేహ హస్తాన్ని అందిస్తున్నాం.. కాకుంటే టెర్రరిజం ఆపండి అన్న అక్బరుద్దీన్

మేమెప్పుడూ స్నేహ హస్తాన్ని అందిస్తున్నాం.. కాకుంటే టెర్రరిజం ఆపండి అన్న అక్బరుద్దీన్

ఇరుగుపొరుగు వారి మధ్య సంబంధాలు ఎందుకు లేవని, చర్చల కోసం భారతదేశ ఎందుకు స్పందించడం లేదని పాకిస్థాన్ జర్నలిస్టు ప్రశ్నించారన్న అక్బరుద్దీన్ చర్చలు ప్రారంభించడానికి ముందు టెర్రరిజం పేరుతో జరుగుతున్న బీభత్సం ఆపండి అంటూ సమాధానమిచ్చారు. ఇక అంతే కాదు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్న వాతావరణాన్ని చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు అంతేకాదు ఒక రాష్ట్రం తమ నాయకులతో సహా భారతదేశంలో హింసకు వ్యతిరేకంగా జిహాద్ పరిభాషను వినియోగించడం ఆశ్చర్యంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు . జమ్మూ కాశ్మీర్ పై భారతదేశం తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ జరిగిందని, కాశ్మీర్ లోని అన్ని ఆంక్షలను క్రమంగా తొలగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాధారణ స్థితి నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అక్బరుద్దీన్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Syed Akbaruddin, India's Ambassador and Permanent Representative to the United Nations, made a symbolic gesture of extending "the hand of friendship" to Pakistani journalists on Friday, during a media briefing after the United Nations Security Council held a closed-door meeting to discuss New Delhi's move to end special status for Jammu and Kashmir. India had said that the country's national position was and remains that matters related to Kashmir are "entirely an internal matter"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more