వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాపై నిఘా: రూ. 2,000 కోట్లతో 100 డ్రోన్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: సమావేశాలు, సదస్సుల సమయంలో భారత్ తో సన్నిహితంగా, అనుకూలంగానే ఉన్నట్లు కనిపించే చైనా అప్పుడప్పుడు సరిహద్దుల్లో చెలరేగిపోతూ కవ్వింపు చర్యలకు దిగుతుంటుంది.

భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయ్యడమే కాకుండ అనేక సార్లు భారత్ మిలటరీ క్యాంపులపై దాడులు చేసే ప్రయత్నం కూడా చేసింది. చైనా ఆటలు అరికట్టడానికి భారత్ సిద్దం అయ్యింది.

ఎప్పటికప్పుడు చైనా సైన్యం చేస్తున్న ఆగడాలు పసిగట్టడానికి భారత్-చైనా సరిహద్దుల్లో మానవరహిత విమానాలు అయిన డ్రోన్లు ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. అత్యాధునిక డ్రోన్లు కొనుగోలు చెయ్యాలని రక్షణ శాఖ నిర్ణయించింది.

India seeks armed Drones from America

రూ. 2,000 కోట్ల వ్యయంతో అమెరికా నుంచి అత్యాధునికమైన 100 డ్రోన్లు తెప్పించాలని ఢిల్లీలోని రక్షణ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ఆ డ్రోన్లను భారత్-చైనా సరిహద్దుల్లో ఉపయోగించనున్నారు.

100 డ్రోన్లతో పాటు ప్రిడేటర్ ఎక్స్ పీ డ్రోన్లను కూడా కొనుగోలు చేసి దేశ అంతర్గత భద్రతకు ఉపయోగించనున్నారు. ఈ డ్రోన్లు ఉగ్రదాడుల వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో కీలపాత్ర పోషిస్తాయి. అమెరికాతో ఇప్పటికే ఈ విషయంపై చర్చలు మొదలైనాయి.

English summary
India had requested for the latest Avenger drones, which is basically an unmanned combat air vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X