వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ చైనా కంపెనీలకు భారత్ సరికొత్త షాక్!: చైనా మీడియా హెచ్చరిక

గత రెండు నెలలుగా భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైనా వస్తువుల వినియోగాన్ని నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైనా వస్తువుల వినియోగాన్ని నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

చదవండి: సరిహద్దులో ఉద్రిక్తత: చైనా రక్తసేకరణ, 'ఏ క్షణమైనా యుద్ధం?'

ఇందులో భాగంగా భారత ప్రభుత్వం చైనా పురోగతిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యుత్‌, టెలికం రంగంలో చైనా పెట్టుబడులు తగ్గించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది.

ఈ కంపెనీల నుంచి భారత్‌కు సరఫరా

ఈ కంపెనీల నుంచి భారత్‌కు సరఫరా

చైనాకు చెందిన హార్బిన్‌ ఎలక్ట్రిక్స్‌, డాంగ్‌ఫాంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, షాంఘై ఎలక్ట్రానిక్‌, సైఫాంగ్‌ అటోమేషిన్‌ కంపెనీలు భారత్‌లోని 18 నగరాల్లో విద్యుత్‌ పరికరాలను సరఫరా చేస్తున్నాయి. విద్యుత్‌ రంగంలో చైనా ఉత్పత్తులను వాడటం వల్ల భద్రతాపరమైన సమస్యలను తలెత్తే అవకాశముందని, అందువల్ల వాటి వాడకం పట్ల నిబంధనలు కఠినతరం చేయాలని పలువురు కోరుతున్నారు.

అలా చైనా ఎలక్ట్రానిక్ ముడి పదార్థాల సరఫరాపై కఠినంగా

అలా చైనా ఎలక్ట్రానిక్ ముడి పదార్థాల సరఫరాపై కఠినంగా

ఇందుకు సంబంధించి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) కొత్త నిబంధనలను పొందుపరుస్తూ రూపొందించిన నివేదికను కేంద్రం పరిశీలిస్తోంది. చైనా నుంచి వస్తున్న ఎలక్ట్రానిక్‌ ముడి పదార్థాల సరఫరా విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంతో వాటి రవాణాను కొంత అడ్డుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అలా సైబర్ దాడికి అవకాశం

అలా సైబర్ దాడికి అవకాశం

విద్యుత్‌ రంగంలో వేరే దేశాల పరికరాలను ఉపయోగించడం వల్ల భారత విద్యుత్‌ వ్యవస్థపై సైబర్‌ దాడి జరిగే అవకాశముందని సీఈఏ ఛైర్మన్‌ అభిప్రాయపడ్డారు.

చైనా మీడియా హెచ్చరిక

చైనా మీడియా హెచ్చరిక

ఇప్పటికే డొక్లామ్‌ వివాదం విషయంలో భారత్‌ - చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుందని, ఈ నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య ఉన్న విద్యుత్‌ పెట్టుబడుల సహకారంపై నిషేధం విధించడం అవాస్తవికమని, అదే జరిగితే అందుకు భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

మొబైల్ కంపెనీలకు ఆదేశాలు

మొబైల్ కంపెనీలకు ఆదేశాలు

మరోవైపు, భారత్‌ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలపై ఇప్పటివరకు చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు స్పందించలేదు. గత వారం చైనా మొబైల్‌ కంపెనీలు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామంటూ సమ్మతి పత్రాన్ని సమర్పించాల్సిందిగా భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

చైనా మొబైల్ కంపెనీలకు నోటీసులు

చైనా మొబైల్ కంపెనీలకు నోటీసులు

వినియోగదారుడి ఫోన్ నెంబర్లు, సందేశాలు తదితర సమాచారాన్ని చైనా మొబైల్‌ కంపెనీలు తస్కరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. షియోమి, లెనోవో, ఒప్పో, వివో, జియోనీతో పాటు పలు చైనా మొబైల్‌ కంపెనీలకు ఈ నోటీసులు పంపించింది.

English summary
India is tightening the rules for businesses entering its power transmission sector and making stringent checks on both power and telecoms equipment for malware - moves that government and industry officials say aim to check China's advance into sensitive sectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X