• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇమ్రాన్ కశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరం-అక్రమిత ప్రాంతాలు వదిలివెళ్లాలని వార్నింగ్

|

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా.. భారత్ దీనికి కౌంటర్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఇమ్రాన్ ప్రసంగంలో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఐరాస సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంలో కశ్మీర్ పై చేసిన విమర్శలు, వ్యాఖ్యలను ఐరాసలో భారత ప్రథమ కార్యదర్శి స్నేహా దూబే తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ అధినేత భారత్ అంతర్గత విషయాలను ప్రస్తావించడం ద్వారా ప్రపంచ వేదికపై అబద్ధాలు చెప్పారని, దీనికి కౌంటర్ ఇచ్చేందుకు తమకున్న హక్కును కచ్చితంగా వాడుకుంటామని స్నేహా దూబే వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్తాన్ అగ్నిమాపక సిబ్బందిలా మారువేషం వేసుకుందని స్నేహా దూబే ఆరోపించారు. పొరుగు దేశాన్ని తన అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయమని కూడా పిలుపునిచ్చారు.

India slams Pak for raking up Kashmir at UNGA, ask pakistan to vacate all occupied areas

UNGA లో నిన్న సాయంత్రం ప్రసారమైన తన ప్రీ-రికార్డ్ ప్రసంగంలో, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, జమ్మూ కాశ్మీర్ వివాదానికి భారత ప్రభుత్వం అరిష్టంగా పిలిచే పరిష్కారాన్ని మొదలుపెట్టిందని అన్నారు. 2019 లో ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఇలా విమర్శించారు. కాశ్మీర్‌లో భారత దళాలు చేసిన స్ధూల, క్రమబద్ధమైన మానవ హక్కుల ఉల్లంఘన ఇది అని ఇమ్రాన్ పేర్కొన్నారు. దీనిపైనే భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్నేహా దూబే స్పందిస్తూ ఇలాంటి ప్రకటనల ద్వారా అబద్దాన్ని పదే పదే చెప్పాలని ప్రయత్నిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పట్ల మనం సానుభూతి చూపడం మినహా చేయగలిగిందేమీ లేదన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలకు అక్కడే సమాధానం ఇస్తామని ఆమె వెల్లడించారు.

  Evergrande Crisis Turn Into China's Lehman Brothers? Explained || Oneindia Telugu

  ఐరాసలో భారతదేశ ప్రతినిధి స్నేహా దుబే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ దేశాల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని, సాధారణ ప్రజలు, ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల ప్రజల జీవితాలు తలక్రిందులు అవుతున్న నేపథ్యంలో తీవ్రవాదులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్న దేశం మానసిక స్ధితికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా ఉన్నాయని ఆమె తెలిపారు. మరోవైపు, భారతదేశం మాత్రం తమ దేశంలో అత్యున్నత పదవులను కలిగి ఉన్న మైనారిటీల గణనీయమైన జనాభాతో బహుళజాతి ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతోందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, సహాయం చేయడం, చురుకుగా మద్దతునివ్వడాన్ని ప్రపంచదేశాలు అర్ధం చేసుకుంటున్నాయని స్నేహాై దూబే వెల్లడించారు. ఇప్పుడు ఇమ్రాన్ తన ప్రసంగం ద్వారా ఈ చర్యలకు మరోమారు మద్దతునిచ్చారని ఆమె తెలిపారు.

  English summary
  india on today slams pakistan's raking up of kashmir issue in united nations general assembly again and again and call upon the neighbour country to vacate all illegal occupied areas.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X