వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు : పాక్‌ స్పందన విద్వేషపూరితం: ఖండించిన భారత్..!

|
Google Oneindia TeluguNews

అయోధ్య తీర్పు పైన పాక్ స్పందనకు భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల పాకిస్తాన్‌ స్పందనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అయోధ్యపైన సుప్రీం తీర్పు రాగానే..పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ స్పందించారు. ఆ సందర్భంలో ఆయన స్పందించిన తీరు పైన భారత్ ఫైర్ అయింది. ఓ వైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ వ్యాఖ్యానించారు.

ఈ చర్యతో తాను బాధకు గురయ్యానని చెప్పారు. సంతోషకరమైన సమయంలో ఇలాంటి సున్నిత అంశంపై తీర్పు సరి కాదని అన్నారు. సిక్కుల మత గురువైన గురునానక్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా మరికొంత కాలం ఆగి తీర్పు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు.

India strongly congemns Pakistan forign affairs minister Khureshi remarks on Ayodhya verdict

మరింత ఒత్తిడికి లోనవుతారు..

భారతీయ ముస్లింలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, తాజా తీర్పుతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారని అన్నారు. పాక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ ఈ తీర్పును అన్యాయపు తీర్పుగా అభివర్ణించారు. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖలో ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ అసిస్టెంట్‌ ఫిర్‌దౌస్‌ ఆషిఖ్‌ అవాన్‌ సుప్రీంకోర్టును కేంద్రం నడుపుతోందంటూ వ్యాఖ్యానిం చారు.

ఓ వైపు పాక్‌ కర్తార్‌పూర్‌తో మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తుంటే, భారత్‌ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యల మీద భారత విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ స్పందంచింది. ఆయన వ్యాఖ్యల పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

భారత్ ఖండన..
రామజన్మభూమి-బాబ్రీమసీద్‌ వివాద కేసుపై సుప్రీం కోర్టు తీర్పు పట్ల పాకిస్తాన్‌ స్పందనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌ స్పందన అవాంఛనీయం, అసందర్భమని తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్‌ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.

భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాక్‌ వ్యాఖ్యానించిన తీరు దురుద్దేశపూరితంగా ఉందని, అసందర్భంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ సంతోషకర సమయాన సున్నితత్వం లేని వైఖరి చూపడం పట్ల విచారం వెలిబుచ్చుతున్నట్టు పేర్కొన్నారు.

English summary
India strongly congemns Pakistan forign affairs minister Khureshi remarks on Ayodhya verdict. India foregin affairs official Ravish Kumar seriously responded on Khureshi comments.He says its purelu Indian interna matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X