వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐక్యరాజ్యసమితిలో భారత్ భారీ విజయం: మానవ హక్కుల మండలిలో స్థానం

|
Google Oneindia TeluguNews

Recommended Video

మానవ హక్కుల మండలిలో భారత్ కు స్థానం

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు తగిన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యున్నత మానవ హక్కులసంస్థ అయిన ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) మానవ హక్కుల సంస్థకు భారత్‌ ఎన్నికైంది. మానవ హక్కుల మండలి(యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ అత్యధిక ఓట్లతో నెగ్గింది.

ఆ మండలి సభ్యత్వం కోసం జరిగిన పోల్‌లో భారత్ 188 ఓట్లు సాధించింది. ఆసియా పసిఫిక్ క్యాటగిరీలో భారత్‌కు ఈ గౌరవం దక్కడం విశేషం. మానవ హక్కుల మండలిలో భారత్ మూడేళ్ల సభ్యత్వం దక్కించుకుంది. 2019, జనవరి 1వ తేదీ నుంచి ఈ సభ్యత్వం అమలులోకి వస్తుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి.

India wins seat in UN Human Rights Commission

మానవ హక్కుల మండలిలో 18 మంది కొత్త సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో 97 ఓట్లు రావాల్సి ఉండగా, మనదేశానికి 188ఓట్లు పోలయ్యాయి. యూఎన్‌ సాధారణ అసెంబ్లీలో శుక్రవారం 18దేశాలు కొత్తగా ఎన్నికయ్యాయి. ఆసియాపసిఫిక్‌ ప్రాంతం నుంచి ఐదుదేశాలకు స్థానం ఉండగా మన దేశంతో పాటు బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, ఫిజి, ఫిలిప్పీన్స్‌ ఎన్నికయ్యాయి.

భారత్ విజయం అంతర్జాతీయంగా మన దేశ ప్రమాణాన్ని సూచిస్తుందని యూఎన్ అంబాసిడర్ సయ్యిద్ అక్బరుద్దీన్ తెలిపారు. మద్దతు తెలిపిన మిత్రదేశాలకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతూ యూఎన్ అంబాసిడర్ ట్వీట్ చేశారు.

English summary
India on Friday won the seat to UN Human Rights Council after getting 188 votes in the Asia Pacific category. India has been appointed for a period of three years from 2019 to 2022. India reportedly got highest number of votes among all the other candidate nations.
Read in English: India wins seat in UNHRC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X