వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా చీఫ్‌గా భవ్య: గూగుల్.. మైక్రోసాఫ్ట్ తరువాత ఆ స్థాయి అత్యున్నత పదవి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. నాసాలో భారత సంతతికి చెందిన మహిళ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా నాసా యాక్టింగ్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆమె పేరు భవ్యా లాల్. ఆమె నాసా యాక్టింగ్ చీఫ్‌గా నియమితులైనట్లు నాసా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు భవ్యా లాల్‌ను చీఫ్‌గా నియమించినట్లు తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీల తరువాత.. ఆ స్థాయిలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అత్యున్నత పదవిని భారతీయులు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

ఇదివరకు అమెరికా అధ్యక్షుడి ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీమ్‌లో సభ్యురాలిగా పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు భవ్యాలాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనా విభాగంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆ సమయంలో అంతరిక్ష పరిశోధనలను సాగించారు. అమెరికా స్పేస్ టెక్నాలజీ, స్ట్రాటజీ సలహాదారుగా వ్యవహరించారు. డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్‌గా, వైట్‌హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ స్పేస్ కౌన్సిల్ గెస్ట్ మెంబర్‌గా ఉన్నారు.

Indian-American Bhavya Lal appointed Acting Chief of Staff of US space agency NASA

Recommended Video

The Great Conjunction : Jupiter and Saturn Reunite after 800 years to Form a Rare 'Christmas Star'

అమెరికా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని కమిటీలకు కోఆర్డినేటర్‌గా పని చేశారు. స్పేస్ టెక్నాలజీపై ఆమెకు మంచి పట్టు ఉండటంతో ఏకంగా నాసా చీఫ్‌గా నియమితులయ్యారు. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని సాధించారు. ఇంజినీరింగ్ విద్యార్థినిగా న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు చేశారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీ, అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ సాధించారు. ఎంఐటీ, వాషింగ్టన్ యూనివర్శిటీల్లో ఇప్పటికీ న్యూక్లియర్ ఇంజినీరింగ్, పబ్లిక్ పాలసీ విభాగాల్లో గౌరవ శాస్త్రవేత్తగా ఉన్నారు.

English summary
Indian-American Bhavya Lal was on Monday appointed by NASA as the Acting Chief of Staff of the US space agency. Lal served as a member of the Biden Presidential Transition Agency Review Team for the agency and oversaw the agency’s transition under the administration of President Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X