వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హీరోయిన్’తో కోట్ల స్కాం బయటికి... భారతీయ అమెరికన్ కు 9 ఏళ్ల జైలుశిక్ష

నకిలీ పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, నగదు అక్రమ బదిలీ కుంభకోణం కేసులో అమిత్ చౌదరి అనే భారతీయ అమెరికన్ కు అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టు 9 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అలెగ్జాండ్రియా: ఒక టీవీ స్టార్ ఫొటోతో తయారైన నకిలీ పాస్ పోర్ట్ అమెరికాలో పెద్ద కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, నగదు అక్రమ బదిలీ కుంభకోణం వెలుగులోనికి వచ్చింది.

ఈ తప్పుడు పనుల ద్వారా లక్షల డాలర్లు సంపాదించిన ఓ భారతీయ అమెరికన్ కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. 1992లో అమెరికాకు వెళ్లిన అమిత్ చౌదరి అనే వ్యక్తికి అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టు 9 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

తానెప్పుడూ జైలుకు వెళతానని అనుకోలేదని, కుటుంబం కోసంమే ఈ నేరాలకు పాల్పడ్డానని అమిత్ పేర్కొన్నాడు. ఎఫ్ బిఐ ఏజెంట్ ఒకరు అమెరికాలోని టీవీ స్టార్ లారా వండెర్ వూట్ చిత్రాన్ని నకిలీ పాస్ పోర్ట్ పై చూడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

 Indian-American found guilty in identity theft scam

ఇతరుల క్రెడిట్ కార్డులను అమిత్ చౌదరి చోరీ చేసి ఆ డబ్బును షెల్ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా బదిలీ చేసేవాడు. తక్కువ ధరలకు ప్రయాణ ప్యాకేజీలు అందిస్తామంటూ ప్రకటనలు కూడా ఇచ్చేవాడు. ఆ తరువాత వినియోగదారుల డబ్బులు తస్కరించే వాడు.

చోరీ చేసిన క్రెడిట్ కార్డులతో వారి హోటల్, ప్రయాణ, భోజన బిల్లులు చెల్లించేవాడు. భారత్ లోని అమెరికన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసే ఓ వ్యక్తి సాయంతో నకిలీ క్రెడిట్ కార్డులు సృష్టించి 25 మిలియన్ డాలర్లు ఇతడు కొల్లగొట్టాడు.

చివరికి టీవీ స్టార్ లారా చిత్రంతో కూడిన నకిలీ పాస్ పోర్ట్ ఆధారంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అమిత్ చౌదరి బృదంపై కన్నేసి వారిని పట్టుకుంది. ఈ కుంభకోణంలో తనతోపాటు మరికొందరికి సంబంధం ఉన్నట్లు అమిత్ ఒప్పుకున్నాడు.

English summary
Indian-American Amit Chaudhry has been sentenced to nine years in prison in a multimillion-dollar identity theft and money laundering scam, the Washington Post reported today. Amit Chaudhry, who emigrated to the US in 1992, ran a money laundering network by helping relatives in India through stolen credit cards and making up identities through shell bank accounts, the report said. He also operated cheap travel packages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X