వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా సుప్రీంకోర్టు జడ్జీగా శ్రీ శ్రీనివాసన్?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రవాస భారతీయుడు శ్రీకాంత్‌ శ్రీ శ్రీనివాసన్‌ నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ప్రిన్సిపల్‌ డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు.

కాగా, అమెరికా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఆంటోనిన్‌ స్కాలియా ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు తగిన వ్యక్తి కోసం అన్వేషణ మొదలైంది. ఆ అవకాశం ఉన్నవారిలో శ్రీనివాసన్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు.

Indian-American judge Sri Srinivasan on US Supreme Court?

ఆ రంగంలో ఎంతోమంది నిష్ణాతులను పరిశీలించిన ఒబామా రాజకీయంగా రెండు పార్టీల మద్దతు ఉన్న శ్రీనివాసన్‌ను నామినేట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిఫెన్స్‌ వివాహ చట్టానికి వ్యతిరేకంగా శ్రీనివాసన్‌ విజయవంతంగా పోరాడారు.

తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన శ్రీనివాసన్‌ కుటుంబం 1960లోనే అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడింది. 2013లోనే డిసిలోని కోర్టు ఆఫ్ అప్పీల్‌కు ఎంపికైన తొలి ఆసియన్ అమెరికన్, భారతీయ అమెరికన్‌గా శ్రీనివాసన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అమెరికాలో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీగా బాధ్యతలు చేపట్టే అవకాశంలో ముందున్నారు.

English summary
Sri Srinivasan could become the first Indian-American to be on the bench of the US Supreme Court after conservative icon Justice Antonin Scalia's sudden death gave rise to speculation that President Barack Obama may nominate the judge who enjoys impeccable bipartisan support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X