వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్‌ టీమ్‌లో మరో భారతీయ అమెరికన్‌ - పాలసీ డైరెక్టర్‌గా మాల అడిగ....

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ముందే భారతీయుల మనసు గెల్చుకున్న జో బైడెన్‌ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక భారతీయులకు తన టీమ్‌లో కీలక స్ధానాలు కట్టబెడుతున్నారు. ఇప్పటికే బైడెన్‌ విజయాల వెనుక భారత సంతతికి చెందిన వివేక్‌ మూర్తి కీలక పాత్ర పోషిస్తుండగా.. మరో భారతీయ అమెరికన్‌ మాల అడిగకు జో బైడెన్‌ కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

హోరాహోరీగా సాగిన అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ వ్యూహాల్లో పలువురు భారతీయులు కీలక పాత్ర పోషించారు. వీరిలో వివేక్ మూర్తి చాలా కీలకం. ఆ తర్వాత స్దానంలో మాల అడిగ కూడా ఉన్నారు. మాల జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌కు సీనియర్‌ సలహాదారుగా ఉన్నారు. అంతే కాకుండా బైడెన్‌- కమలా హ్యారిస్‌ ప్రచార విధానాల డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. బైడెన్‌ ఫౌండేషన్లో ఉన్నత విద్య, మిలటరీ కుటుంబాల విభాగాలకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాల మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలోనూ డిప్యూటీ అసిస్టింట్‌ సెక్రటరీగా పనిచేశారు.

Indian-American Mala Adiga Appointed As Jill Bidens Policy Director

Recommended Video

COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన Pfizer.. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు ఇలా!

ఇల్లినాయిస్‌ రాష్ట్రానికి చెందిన మాల అడిగ... గ్రిన్నెల్‌ కాలేజ్‌, మిన్నెసోటా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, చికాగో యూనివర్శిటీ లా స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ కోర్సులు పూర్తి చేశారు. ఒబామా హయాంలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌కు కౌన్సెల్‌గా తొలిసారి నియమితులయ్యారు. తాజాగా జో బైడెన్ వైట్‌హౌస్‌ కార్యాలయంలో నలుగురు సీనియర్‌ ఉద్యోగులను నిమమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మాలకు కూడా స్దానం దక్కింది.

English summary
US President-elect Joe Biden on Friday appointed an Indian-American, Mala Adiga, the policy director of his wife Jill Biden, who will be the First Lady.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X