వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విషాదం.. భారత సంతతి విద్యార్థి వివేక్ దుర్మరణం.. చదువుల్లో టాప్.. స్నేహంలో బెస్ట్..

|
Google Oneindia TeluguNews

ఒక చిలిపి ఆలోచన.. ఉత్సాహంలో చేసిన తెగింపు.. కోటి కలల్ని నేలకూల్చేశాయి. రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చివెళ్లాయి. అతని పేరు వివేక్ సుబ్రమణి. వయసు 23. అమెరికాలో మెడిసిన్ చదువుతున్నాడు. రెండ్రోజుల కిందట అనూహ్యరీతిలో చనిపోయాడు. వివేక్ సొంతకుటుంబంతోపాటు.. ఇండియన్ అమెరికన్ గా తన మంచితనంతో నిర్మించుకున్న సామాజిక కుటుంబం ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. మనుషుల్లో వివేక్ చాలా ప్రత్యేకమైనవాడని అతని పరిచయస్తులందరూ చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఇండియా సంతతికి చెందిన వివేక్ సుబ్రమణి.. పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియా సిటీలోని డ్రెక్సెల్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక బాధ్యతల్లోనూ ముందుండే వివేక్.. అమెరికాలో తానుండే ప్రాంతంలోని పలు సంఘాల్లోనూ యాక్టిక్ గా పనిచేసేవాడు. ఈ క్వాలిటీనే అతనికి బోలెడంతమంది స్నేహితులయ్యారు. ఆదివారం కాలేజ్ క్యాంపస్ లోనే స్నేహితులతో కలిసి వెళుతూ.. సడెన్ గా బాల్కనీ నుంచి కిందపడటంతో వివేక్ చనిపోయాడని యాజమాన్యం ప్రకటించింది.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజాలు..

పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజాలు..

వివేక్ సుబ్రమణి మరణానికి సంబంధించి డ్రెక్సెల్ కాలేజీ యాజమాన్యం, ఫిలడెల్ఫియా పోలీసులు భిన్న ప్రకటనలు చేయడం విదాదాస్పదమైంది. క్యాంపస్ లో స్నేహితులతో కలిసి ప్రమాదక ఫీట్లు చేస్తూ వివేక్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. క్యాంపస్ లో ఒక బిల్డంగ్ పై నుంచి మరో బిల్డింగ్ మీదికి దూకేందుకు ప్రయత్నించారని, పొరపాటున కాలు జారడంతో కిందపడిపోయాడని ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు వెల్లడైంది.

బతికించేందుకు స్నేహితుల ప్రయత్నం..

బతికించేందుకు స్నేహితుల ప్రయత్నం..

అంతెత్తునుంచి కిందపడటంతో వివేక్ తలకు బలమైన గాయమైందని, సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం రాలేదని అతనితోపాటే ఉన్న స్నేహితులు పోలీసులకు చెప్పినట్లు మీడియాలో రిపోర్టులొచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుణ్ని హుటాహుటిన క్యాంపస్ లోని క్లినిక్ కు తరలించారని, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.

 వివేక్ కోసం ఫండ్ రైజింగ్..

వివేక్ కోసం ఫండ్ రైజింగ్..

చిన్నవయసులోనే అందరికీ ప్రియమైన వ్యక్తిగా ఎదిగిన వివేక్ సుబ్రమణి గుర్తుల్ని కలకాలం గుర్తుంచుకోవాలని అమెరికా, ఇండియాలోని అతని స్నేహితులు నిర్ణయించుకున్నారు. వివేక్ తల్లిదండ్రుల అనుమతితో విరాళాలు సేకరిస్తున్నారు. టార్గెట్ 35వేల డాలర్లుకాగా, ఇప్పటికే 30 వేల డాలర్లు పొగయ్యాయి డాక్టర్ కావాలన్న వివేక్ కల మధ్యలోనే ఆగిపోవడంతో.. అతని పేరుమీద డ్రెక్సెల్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు సాయం చేయబోతున్నారు.

English summary
An Indian-American medical student fell to his death while jumping between rooftops in the city of Philadelphia, according to news reports. The victim was identified as the 23-year-old third-year Drexel College of Medicine student Vivek Subramani. Fundraiser launched in the victim's name
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X