వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాన్సర్ కు పసుపు చికిత్స ... వినియోగ విధానం అభివృద్ధి చేసిన ఇండియన్ సైంటిస్ట్

|
Google Oneindia TeluguNews

క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న ఓ మహమ్మారి. ఇటీవల కాలంలో చాలామందిని బలి తీసుకుంటున్న ప్రధానమైన జబ్బులలో ఒకటి క్యాన్సర్. వయసుతో సంబంధం లేకుండా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఫలానా కారణం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. క్యాన్సర్ కు అధునాతన పద్ధతులలో వైద్య విధానం ఉన్నప్పటికీ మనం నిత్యం ఉపయోగించే వస్తువులకు కూడా క్యాన్సర్ ను పోగొట్టే లక్షణం ఉందని గతంలోనే పలు పరిశోధనలు వెల్లడించాయి.

Indian-American researchers unleash turmerics power to fight cancer

పసుపుతో క్యాన్సర్ కు వైద్యం ... చికిత్సా విధానం అభివృద్ధి

వివిధ ఆరోగ్య సమస్యలు ఉపశమనానికి ఎంతో దోహదం చేసే పసుపు క్యాన్సర్ కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని గత పరిశోధనలు చెప్పాయి. అయితే తాజాగా జీర్ణాశయ క్యాన్సర్ ను నయం చేసే శక్తి పసుపు ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్సలో పసుపు వినియోగ విధానాన్ని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు ఓ భారతీయ శాస్త్రవేత్త.
అమెరికాలోని సౌత్ డకోటా స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ , భారతీయ శాస్త్రవేత్త అయినా హేమ చందు తుమ్మల జీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు. సాధారణంగా పసుపు నల్ల మిరియాలు కలిపిన వేడి పాలను తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది అనేది అనాదిగా మనందరికీ తెలిసిన చిట్కా. భారతదేశంలో వేల ఏళ్ళుగా ఈ చిట్కాను అనుసరిస్తున్నారు. అయితే పసుపు లోను, మిర్యాల లోనూ క్యాన్సర్ ను నివారించే కారకాలు ఉన్నట్లుగా గుర్తించిన హేమ చంద్ కాన్సర్ కోసం పసుపు వినియోగ విధానాన్ని అభివృద్ధి చేశారు.

Indian-American researchers unleash turmerics power to fight cancer

పసుపులో ఉండే కర్కమిన్ క్యాన్సర్ నివారిణి .. చికిత్సకు ఒరా కర్కమిన్ ఈ తయారు చేసిన సైంటిస్ట్ బృందం

పసుపులో ఉండే కర్కమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అయితే పసుపులో ఉండే కర్కమిన్ నీటిలో కరగదని పాలను వేడి చేసినప్పుడు అందులో ఏర్పడే సూక్ష్మ నూనె బిందువుల వల్ల కర్కమిన్ అందులో కరుగుతుందని, పాలతో కలిపి పసుపును తీసుకున్నప్పుడు కర్కమిన్ రక్తంలో కలిసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన తన పరిశోధన ద్వారా వెల్లడించారు. అలాగే పాలల్లో నల్ల మిరియాల ను కూడా వేసి వేడి చేసి తాగడం వల్ల నల్ల మిరియాల లో ఉండే పైపరిన్ కర్కమిన్ శోషణాన్ని మరింత ప్రేరేపిస్తుందని ఆయన తన పరిశోధన ద్వారా వెల్లడించారు.

కర్కమిన్ కు నీటిలో కరిగే స్వభావం లేని కారణంగా దాన్ని వినియోగించుకునే విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు రాలేదు. అయితే ప్రొఫెసర్ హేమ చంద్ బృందం యూ డ్రాగ్ ఇట్ గ్రూపు పాలిమర్లను ఉపయోగించి 'ఒరా కర్కమిన్ ఈ' ని అభివృద్ధి చేసి జీర్ణాశయ క్యాన్సర్ తో పాటు, పెద్దపేగులో తలెత్తే హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్ కు కూడా చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేసింది. జీర్ణాశయంలోని ఆమ్ల స్థాయి లోనే కర్కమిన్ ను కరిగేలా చేయగలిగింది. ప్రొఫెసర్ హేమ చంద్ చేసిన ఈ రీసెర్చ్ లో పసుపుతో క్యాన్సర్ చికిత్స విధాన అభివృద్ధిలో సిద్ధార్థ కే శర్వానీ కీలక పాత్ర పోషించారు. పసుపుతో క్యాన్సర్ కు వైద్యం చేయొచ్చు అని గతంలోనే తెలిసినా వైద్య విధానాన్ని అభివృద్ధి చేసి ప్రొఫెసర్ హేమ చంద్ క్యాన్సర్ బారి నుండి రక్షించేందుకు తన పరిశోధన ఉపయోగపడేలా చేశారు.

English summary
A study revealed that turmeric can cure stomach cancer. Consuming turmeric can cure stomach cancer, revealed a research study in 2018 .. and now an indian scientist Hemachand and his team develpoed the using process of turmeric to treat stomch cancer .South dakota state versity professor Hemachand and his team research study on turmeric using process development in teratment finally succeed .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X