వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమలా హారీస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారతీయ అమెరికన్ సబ్రీనా సింగ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, వైట్‌హౌస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయురాలు సబ్రీనా సింగ్ నియమితులైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల ప్రచారంలోనూ కమలా హారీస్‌కు ప్రెస్ సెక్రటరీగా సేవలందించారు సబ్రీనా సింగ్.

సబ్రీనా సింగ్ తోపాటు వైట్‌హౌస్‌లో పనిచేసే పలువురు సభ్యుల నియామకాలను ప్రకటించారు. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణలో తమకు అండగా నిలబడి మరింత దృఢంగా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారని కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ వ్యాఖ్యానించారు.

 Indian-American Sabrina Singh named White House Deputy Press Secretary

బైడెన్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సబ్రీనా సింగ్ స్పందించారు. ఈ బృందంలో చేరుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కమలా హ్యారీస్ కోసం తాను పనిచేయడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అమెరికా ప్రజల కోసం తనవంతుగా సేవ చేస్తానని సబ్రీనా సింగ్ పేర్కొన్నారు.

ప్రముఖ మల్టీ నేషనల్ కెమికల్ కంపెనీ 'లిండెల్ బసెల్' సీఈఓ, ఛైర్మన్ అయిన ఇండియన్-అమెరికన్ భవేశ్ వి పటేల్‌ను ఫెడరల్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ డల్లాస్ తన హూస్టన్ శాఖ బోర్డు డైరెక్టర్‌గా నియమించింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సీనియర్ అధికార ప్రతినిధిగా, కోరీ బూకర్స్ ప్రెసిడెన్సియల్ క్యాంపెయిన్‌లో నేషనల్ ప్రెస్ సెక్రటరీగా సేవలందించారు సబ్రీనా సింగ్.

ఆమె గతంలో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీకి డిప్యూటీ కమ్యూనికేషన్ డైరెక్టర్, అమెరికన్ బ్రిడ్జ్ ట్రంప్ వార్ రూమ్ ప్రతినిధి, హిల్లరీ క్లింటన్ యొక్క 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేశారు.

సబ్రీనా SKDKnickerbockerలో కూడా పనిచేసింది, రిపబ్లిక్ జాన్ షాకోవీస్కికి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేసింది, వివిధ డెమొక్రాటిక్ కమిటీలలో పనిచేసింది, బిడెన్-హారిస్ ట్రాన్సిషన్ వైట్ హౌస్ వద్ద ఉపరాష్ట్రపతి కార్యాలయంలో అదనపు సభ్యులను ప్రకటించినట్లు చెప్పారు. వారిలో ప్రముఖమైన యాయెల్ బెల్కిండ్, ఉప రాష్ట్రపతికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహాయకుడు; పబ్లిక్ ఎంగేజ్మెంట్, ఇంటర్ గవర్నమెంటల్ వ్యవహారాల కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్‌గా విన్సెంట్ ఎవాన్స్; డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మైఖేల్ ఫుచ్స్; స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా కేట్ చైల్డ్స్ గ్రాహం, ఉపరాష్ట్రపతి విధాన సలహాదారుగా డాక్టర్ ఇకే ఇర్బీ నియమితులయ్యారు.

English summary
Indian-American Sabrina Singh has been named as the White House Deputy Press Secretary in the upcoming Joe Biden administration, according to an announcement made by the Biden-Harris Transition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X