వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా కాంగ్రెస్‌ పోటీలో భార‌త సంత‌తి మ‌హిళ‌ శ్రినా కురణి..

|
Google Oneindia TeluguNews

భార‌త సంత‌తికి చెందిన ఇంజినీర్‌, పారిశ్రామికవేత్త శ్రినా కుర‌ణి అమెరికా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. కాలిఫోర్నియా నుంచి హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌కు పోటీ చేయ‌నున్నారు. రివ‌ర్‌సైడ్‌లో ఉన్న భార‌తీయ ఇమ్మిగ్రాంట్ పేరెంట్స్‌కు కుర‌ణి జ‌న్మించారు. 2022 నవంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మ‌ధ్యంతర ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ నేత కెన్ కాల్వ‌ర్ట్‌పై ఆమె పోటీ చేస్తారు.

సీఏ-42 స్థానం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు శ్రినా కురణి తెలిపారు. కెన్ కాల్వ‌ర్ట్ 30 ఏళ్ల నుంచి ప‌ద‌విలో ఉన్నార‌ని, కానీ ఈ ప్రాంతానికి ఆయ‌న ఏమీ చేయ‌లేదని అంటున్నారు. ఈ సారి కొత్త పంథాలో వెళ్లాల‌ని శ్రినా అన్నారు. లా సిరా హై స్కూల్ నుంచి ఆమె గ్రాడ్యుయేట్ అయ్యారు. యూసీ రివ‌ర్‌సైడ్‌లో శ్రినా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

Indian American Shrina Kurani enters Congressional race from California

ఆహార వ్య‌ర్ధాల నియంత్ర‌ణ గురించి స్టార్ట‌ప్ కంపెనీల్లో పనిచేశారు. అమెరికా దిగువ స‌భ‌లో భార‌త సంత‌తికి చెందిన న‌లుగురు నేత‌లు ఉన్నారు. డాక్ట‌ర్ అమి బెరా, రో ఖ‌న్నా, రాజా కృష్ణ‌మూర్తి, పరిమ‌లా జ‌య‌పాల్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిలో శ్రినా కురణి కలువబోతున్నారు.

కాంగ్రెస్‌కు పోటీ చేసి.. సుపరిపాలన అందిస్తానని శ్రినా కురణి తెలిపారు. వాషింగ్టన్‌ను మంచి డెవలప్ చేస్తానని చెప్పారు. కాలిఫోర్నియాలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యం, భద్రత తనకు ముఖ్యం అని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె వివరించారు. అంతేకాదు కెన్ కల్వర్ట్ తన హయాంలో ఏమీ చేయలేదని ఫైరయ్యారు. ఇక్కడ పోటీ చేసి.. వాషింగ్టన్‌లో ఉంటే ప్రజల బాధలు ఏం తెలుస్తాయని అడిగారు.

English summary
Indian American Democrat Shrina Kurani has said she will challenge 15-term Republican Ken Calvert in California’s 42nd Congressional District for the mid-term elections in November 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X