• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టార్ ట్రెక్ మూవీ చూసి ఆస్ట్రోనాట్‌గా: నాసా మార్స్ మిషన్‌ను నడిపించిన భారత సంతతి మహిళ

|

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ విజయవంతంమైంది. ఏడు నెలల కిందట ప్రయోగించిన ఆస్ట్రోబయాలజీ వాషింగ్టన్: నాసా ప్రయోగించిన ఆస్ట్రోబయాలజీ రోవర్.. పర్సెవెరెన్స్ (Mars Perseverance Rover) అంగారక గ్రహంపై ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్ సక్సెస్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్‌పై సూక్ష్మజీవులను గుర్తించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ వల్ల కొన్ని అద్భుతాలను చూడబోతోన్నామంటూ వ్యాఖ్యానించింది. ఏడు నిమిషాల్లో ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించింది.

నాసా మరో అద్భుతం..ఆస్ట్రోబయాలజీ: అంగారకుడిపై సూక్ష్మజీవులు: మార్స్‌పై దిగిన రోవర్నాసా మరో అద్భుతం..ఆస్ట్రోబయాలజీ: అంగారకుడిపై సూక్ష్మజీవులు: మార్స్‌పై దిగిన రోవర్

ఆస్ట్రోబయాలజీ రూపంలో చేపట్టిన తొలి ప్రాజెక్ట్..

ఆస్ట్రోబయాలజీ రూపంలో చేపట్టిన తొలి ప్రాజెక్ట్..

ఆస్ట్రోబయాలజీ రూపంలో నాసా చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ఇది. భారత సంతతికి చెందిన మహిళ దీనికి సారథ్యాన్ని వహించారు. ఈ మిషన్‌ను ముందుండి నడిపించారు. ఈ మిషన్ మొత్తం ఆమె మార్గదర్శకంలోనే సాగింది. తొలి ప్రకటన కూడా ఆమె నుంచే వెలువడింది. ఆస్ట్రోబయాలజీ పర్సెవెరెన్స్ రోవర్.. అంగారక గ్రహంపై గల జెజెరో క్రెటర్ (Jezero Crater) వద్ద అడుగు మోపిన వెంటనే సంకేతాలను గ్రౌండ్ స్టేషన్‌కు పంపించింది. ఆ వెంటనే- ఈ మిషన్ విజయవంతమైనట్లు డాక్టర్ స్వాతి మోహన్ ప్రకటించారు. రోవర్ సురక్షితంగా అంగారకుడిపైకి దిగిందని, అక్కడి నుంచి సంకేతాలు అందాయని మొట్టమొదటిసారిగా ప్రకటన చేసింది ఆమెనే. అంగారకుడిపై జీవం ఉందనడానికి ఆధారాలను సేకరించడానికి అందరూ సిద్ధం కావాలంటూ సూచించారు.

ఎవరీ స్వాతి మోహన్?

ఎవరీ స్వాతి మోహన్?

స్వాతి మోహన్.. నాసాలో ఇంజినీర్‌గా పనిచేస్తోన్నారు. నాసాలోని కీలకమైన గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్ (జీఎన్ అండ్ సీ)కి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. స్వాతి మోహన్ జన్మించింది భారత్‌లోనే. ఏడాది వయస్సున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. వాషింగ్టన్ డీసీలోని నార్త్ వర్జీనియాలో స్థిరపడ్డారు. ఆమె బాల్యం అక్కడే గడిచింది. తొమ్మిదేళ్ల వయస్సులో స్టార్ ట్రెక్ సినిమాను చూసి, స్ఫూర్తిపొందారు. ఆస్ట్రోనాట్‌గా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

 కార్నెల్ యూనివర్శిటీ నుంచి

కార్నెల్ యూనివర్శిటీ నుంచి

ఆస్ట్రోనాట్ కావాలనే లక్ష్యంతోనే కార్నెల్ యూనివర్శిటీ నుంచి మెకానికల్, ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆస్ట్రో ఫిజిక్స్‌ను అభ్యసించారు. కొంతకాల ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం ఏరోనాటిక్స్/ఆస్ట్రోనాటిక్స్‌లో ప్రఖ్యత మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ (MIT)లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం నాసాలో జూనియర్ ఇంజినీర్‌గా చేరారు. క్రమంగా ఎదిగారు. నాసా ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఆస్ట్రోబయాలజీ పర్సెవెరెన్స్ రోవర్ మిషన్‌ విభాగానికి బదిలీ అయ్యారు. కాలిఫోర్నియా పసడెనాలోని జెట్ ప్రొపుల్షన్ ల్యాబొరేటరీ చీఫ్‌గా నియమితులయ్యారు.

English summary
Indian-American Dr Swati Mohan spearheaded the development of attitude control and the landing system for the NASA's operation Perseverance Rover landing on Mars. The NASA Perseverance rover successfully touched down on the surface of Mars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X