వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కు షాకిచ్చిన ఇండియా మహిళ, వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ నిలదీత

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతి విద్వేష వ్యాఖ్యలు దాడులు చోటుచేసుకొంటున్నాయి. స్థానికేతరులపై దాడులు చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతి విద్వేష వ్యాఖ్యలు దాడులు చోటుచేసుకొంటున్నాయి. స్థానికేతరులపై దాడులు చేస్తున్నారు.

అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోయాయి. దీంతో అమెరికాలో నివసిస్తున్న ఇండియన్లు భయపడుతున్నారు.అయితే ఈ ఘటనలపై అమెరికన్ పాలకవర్గాన్ని ప్రశ్నించాలని ప్రతి ఒక్కరూ కూడ భావిస్తున్నారు.

donald trump

అయితే అమెరికాలో నివసిస్తోన్న ఓ ఇండియన్ మహిళ శ్రీ చౌహన్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీని నిలదీసింది.వైట్ హౌస్ ను ప్రశ్నించేందుకు మీడియా సిద్దంగా లేనందున తానే ప్రశ్నించానని ఆమె చెప్పారు.

వాషింగ్టన్ లోని ఆపిల్ స్టోర్ కు వచ్చిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ ను శ్రీ చౌహన్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది.ఫాసిస్ట్ కోసం పనిచేయడం ఎలా ఉంది అంటూ ఆయనను ప్రశ్నించింది.ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకొన్నారు.

అమెరికా అద్యక్షుడు ట్రంప్ జాతి విద్వేషకుడు. దేశ ద్రోహనికి పాల్పడ్డాడు అంటూ ఆమె ప్రశవ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేక అమెరికా గొప్ప దేశమంటూ సమాధానమిచ్చాడు.అంతేకాదు అమెరికా గొప్పదేశం అవడం వల్లే నీవు ఇక్కడున్నావు అని చెప్పాడు.

రష్యా సహయంతో అధికారంలోకి వచ్చారు. మీరు ఎలా గొప్పవారు అవుతారని ఆమె ప్రశ్నించింది.మీరు నేరస్తులు కాదా అంటూ ఆమె ప్రశ్నలు కురిపించింది.ఈ సంబాషణను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

English summary
An Indian-American woman confronted White House Press Secretary Sean Spicer at a local Apple store and repeatedly asked him how does it feel to work for a "fascist".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X