వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరే: యూఎస్ ఎన్నికల్లో భారతీయుల జయకేతనం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా సార్వత్రిక ఎన్నికల్లలో భారతీయ అమెరికన్లు తమ సత్తా చాటి సంచలనం సృష్టించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని స్థానాల్లో పోటీ చేసిన నలుగురు అమెరికా ప్రతినిధుల సభకు, ఒకరు సెనేట్ కు ఎన్నికై భారతీయుల సత్తా చూపించారు.

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో భారతీయుల గాలి అనూహ్యంగా వీచింది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి సెనేటర్ గా ఎన్నికైన తొలి నల్లజాతి ఆసియన్ గా కమలా హారిస్ ఈ ఘనత సాధించారు. ఆమె మంచితనం అందరిని ఆకర్షించడంతో కమలా హారిస్ ప్రత్యర్థిని చిత్తు చేశారు.

అదే విధంగా రాజా కృష్ణమూర్తి, డాక్టర్ అమీ బెరా, ఆర్ వో ఖన్నా, కమలా హారిన్, ప్రమీలా జయపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికై ఘన విజయం సాధించారు. వీరిలో కమలా హారస్, రాజా కృష్ణమూర్తి, అమీ బెరా అభ్యర్థిత్వానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వీరిలో కమలా హారిస్, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తికి తమిళ మూలాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ మూలాలు ఉన్న ఐదు మంది పోటీ చెయ్యగా ముగ్గురు విజయం సాధించారు. మిగిలిన ఇద్దరూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కమలా హారిస్ కు ఓ లెక్కుంది

కమలా హారిస్ కు ఓ లెక్కుంది

కాలిఫోర్నియా నుంచి తొలిసారి ఎన్నికైన సెనేటర్ గా ఈమె చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా నుంచి తొలి భారతీయ అమెరికన్, తొలి ఆసియన్ కూడా ఈమె కావడం గమనార్హం. ప్రత్యర్థి శాంచెజ్ పై ఆమె ఎకంగా 13 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుత అమెరికా సెనేట్ కు ఎన్నికైన ఐదో నల్ల జాతి వ్యక్తి. అమెరికాలో సెనేట్ ఎన్నికైన రెండో నల్లజాతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. అయితే కాలిఫోర్నియా నుంచి ఇప్పటి వరకు నల్లజాతి, ల్యాటిన్ నాయకులు సెనేట్ కు ఎన్నికైనట్లు చరిత్రలోనే లేదు. అయితే ఆ రికార్డును కమలా హారిస్ తిరగరాశారు. కమలా హారిస్ 1960లో జన్మించారు. ఆమె తల్లి చెన్నై నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తతుం కమలా హారిస్ రెండో సారి కాలిఫోర్నియా రాష్ట్ర అటర్నీ జనరల్ గా ఉన్నారు.

ప్రమీలా జయపాల్

అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా ఈమె చరిత్ర సృష్టించారు. ఈమె వాషింగ్టన్ సెనేట్ స్థానానికి ఎన్నికైనారు. ప్రత్యర్థి బ్రాడీ వాకిన్షాకు 43 శాతం ఓట్లు రాగా ప్రమీలా జయపాల్ కు 57 శాతం ఓట్లు వచ్చాయి. ప్రమీలా జయపాల్ చెన్నైలో జన్మించారు. ఆమెకు ఐదేళ్లు ఉన్న సమయంలో ఇండోనేషియా వెళ్లారు. తరువాత సింగపూర్, అమెరికా వెళ్లారు. 25 ఏళ్ల తరువాత మొదటి సారి ప్రమీలా జయపాల్ భారత్ కు వచ్చారు. ఆ సమయంలో పిలిగ్రిమేజ్ టు ఇండియా, ఏ వుమెన్ రీవిజిట్స్ హర్ హోమ్ ల్యాండ్ అనే పుస్తకం రాశారు. ప్రమీలా జయపాల్ కు రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు ఉంది.

షికాగో నుంచి రాజా కృష్ణమూర్తి

షికాగో నుంచి రాజా కృష్ణమూర్తి

ఇల్లినాయీలోని షికాగో ఏరియా నుంచి ఈయన ప్రతినిధుల సభకు రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పీటర్ డికియానీపై గెలుపొందారు. ఈయన ఢిల్లీలో జన్మించారు. అయితే రాజా పూర్వికులది చెన్నై. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన రెండో హిందూ-అమెరికన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004, 2008లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈయన సలహాదారుడిగా పని చేశారు. సోలార్ టెక్నాలజీలో విధ్యార్థులకు శిక్షణ ఇచ్చే ఇన్ స్పైర్ అనే స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు రాజా. ప్రస్తుతం శివనాథన్ ల్యాబ్స్ అండ్ ఎపిసోలర్ ఇంక్ అధ్యక్షుడిగా రాజా కృష్ణమూర్తి పని చేస్తున్నారు.

రోహిత్ ఖన్నా అలియాస్ ఆర్ వో ఖన్నా

కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓ స్థానం నుంచి ఆర్ వో ఖన్నా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈయన గెలుపు వెనుక ఓ రికార్డు నమోదు అయ్యింది. ఎకంగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న మైక్ హోండాను చిత్తుగా ఓడించి ఆర్ వో ఖన్నా తన సత్తా చూపించారు. ఫిలడెల్ఫియాలో స్థిరపడిన భారతీయ దంపతులకు రోహిత్ ఖన్నా జన్మించారు. అమెరికా వాణిజ్య శాఖలో ఒబామా కింద డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేశారు.

ఒకే ఒక్కడు ఈ డాక్టర్ అమీ బెరా

ఒకే ఒక్కడు ఈ డాక్టర్ అమీ బెరా

అమెరికా కాంగ్రెస్ లో ఏకైక భారతీయ అమెరికన్ అయిన ఈయన మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికైనారు. అయితే అమీ బెరా ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చడానికి అడ్డదార్లు తొక్కారని ఆరోపిస్తూ అమీ బెరా తండ్రిని ఈ ఏడాది మొదట్లోనే జైలుకు పంపించారు. కేవలం రెండు శాతం ఓట్లతో అమీ బెరా విజయం సాధించారు. ఈయన ఇండియా కాక్ సకు కో చేర్మన్ గా ఉన్నారు.

English summary
Many first and second generation immigrants, particularly Indian-Americans, get their break in politics running for school board and other offices at the county level.Pramila Jayapal is a State Senator and progressive Democrat running for the US House in Washington's 7th CD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X