వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్వేష నేరాలకు అరికట్టాలంటూ.. వైట్‌హౌస్‌ ఎదుట ఇండో అమెరికన్ల ఆందోళన

అమెరికాలో జాత్యహంకార దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ ఎదుట పలువురు ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ ఎదుట పలువురు ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు. భారత సంతతికి చెందిన వారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు అమెరికాలో విద్వేషపూరిత దాడులకు బలవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వైట్ హౌస్ ఎదుట అవగాహన ర్యాలీ నిర్వహించారు. అమెరికాలో విద్వేషానికి హిందువులు ఎక్కువగా బలవుతున్నారని వర్జీనియాకు చెందిన న్యాయవాది వింద్య అడపా అన్నారు.

Indian-Americans protest outsidec, ask Trump to end hate

తాము ట్రంప్ యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం లేదని, కేవలం విద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగానే అవగాహన ర్యాలీ చేపట్టామని పేర్కొన్నారు. ఈ విద్వేష నేరాలకు వ్యతిరేకంగా తమకు ట్రంప్ యంత్రాంగం మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు వింద్య చెప్పారు.

ఇంకా, అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నేరాలను తీవ్రంగా ఖండించాలని తాము కోరుతున్నామని, హిందువులు, సిక్కులను మధ్యప్రాచ్య దేశాలకు చెందిన వారిగా పొరబడుతున్నారని ఆమె పేర్కొన్నారు. విద్వేష నేరాలకు పాల్పడే నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ట్రంప్ యంత్రాంగానికి ఒక వినతి పత్రం సమర్పించారు.

English summary
Somya Sheshadri came to the United States from India when she was seven. A doctor now, she was among a group of Indian Americans gathered outside the White House to convey their fears and apprehensions to President Donald Trump. Sheshadri, her friend Vindhya Adapa, parents, uncles and aunts, neighbours and acquaintances stood there on a cold blustery afternoon, holding posters, making barely audible speeches on bullhorns, gawked at and photographed by curious tourists on foot and Segways, and at times, overshadowed by a more colourful and raucous group of Macedonian protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X