వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు: పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ గట్టి హెచ్చరిక, ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)లో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అక్కడి ప్రజల్ని టార్గెట్ చేయవద్దని ఇండియన్ ఆర్మీ బుధవారం పాకిస్తాన్ ఆర్మీకి హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లోని భారత్ వైపు ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. అలాంటి పరిస్థితులు వస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

<strong>అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానం</strong>అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానం

తీవ్రంగా స్పందించిన భారత ఆర్మీ

తీవ్రంగా స్పందించిన భారత ఆర్మీ

జమ్ము కాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల‌ ప్రజలే లక్ష్యంగా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతోందని చెబుతున్నారు. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఈ విషయంపై స్పందించిన భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది.

ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవద్దు

ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవద్దు

ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవద్దని తాము పాకిస్థాన్‌ను హెచ్చరించిన తర్వాత ఎల్ఓసీ ప్రాంతాల్లో ప్రస్తుతం తాత్కాలికంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. కృష్ణాఘాటి, సుందర్‌బానీ ప్రాంతాల్లో పాక్ గత 24 గంటలుగా పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడిందని చెప్పారు. పాక్ ఆర్మీ పాల్పడుతున్న ఈ చర్యలను భారత ఆర్మీ తిప్పికొడుతోందని, మన ఆర్మీలో ప్రాణనష్టం సంభవించలేదని, పౌరులకు ఎటువంటి గాయాలు కాకూడదనే నిబద్ధతతో తాము పని చేస్తున్నామని చెప్పారు.

పాక్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

పాక్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ముఖ్యంగా ఎల్ఓసీ ప్రాంతాలపై దృష్టి పెట్టామని, మరోవైపు మన భద్రతా బలగాలు ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని పని చేస్తున్నారని, వారికి లభిస్తున్న మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెట్టారని ఇండియన్ ఆర్మీ తెలిపింది. పాక్ నుంచి విపరీతమైన చర్యలు ఉంటే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

English summary
Amid heightened Indo-Pak tension, sources in the security establishment on Wednesday said that Pakistan has mobilised additional troops and military equipment from its frontier with Afghanistan to forward positions in several sensitive sectors along the LoC in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X