వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలి తీసుకున్న నిర్లక్ష్యం.. బస్సులో వదిలేయడంతో ఆరేళ్ల చిన్నారి మృతి..

|
Google Oneindia TeluguNews

దుబాయ్ : నిర్లక్ష్యం చిన్నారిని బలితీసుకుంది. బస్సులో నిద్రపోతున్న భారత సంతతికి చెందిన ఆరేళ్ల పిల్లాడిని గంటల తరబడి ఎవరూ పట్టించుకోకపోవడంతో మృత్యువాతపడ్డాడు. హృదయ విదారకమైన ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. కేరళకు చెందిన మహ్మద్ ఫర్హాన్ ఫైజల్ దుబాయ్‌లోకి అల్‌ఖోజ్‌లోని ఇస్లామిక్ సెంటర్‌లో చదువుకుంటున్నాడు. ఉదయం రోజులాగే స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి బస్సులో నిద్రపోయాడు.

నేపాల్ విద్యార్థులకు నిర్భంధ చైనా భాష...!నేపాల్ విద్యార్థులకు నిర్భంధ చైనా భాష...!

ఉదయం 8గంటలకు ఇస్లామిక్ సెంటర్‌కు బస్సు చేరుకుంది. విద్యార్థులతో పాటు డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయారు. సీటులో నిద్రపోతున్న బాలుడిని ఎవరూ గమనించలేదు. దాదాపు 7గంటల అనంతరం విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ అక్కడికి వచ్చాడు. మహ్మద్ ఫర్హాన్ ఫైజల్ మృతి చెందిన విషయాన్ని గమనించి ఇస్లామిక్ సెంటర్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే బాలుడి మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. ఊపిరాడకపోవడం వల్లే చిన్నారి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

Indian boy dies after being forgotten on Dubai bus

దుబాయ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు. 2014లో అబుదబీలోని అల్ వరూద్ అకాడమీ ప్రైవేట్ స్కూల్‌లో కేజీ 1 విద్యార్థి బస్సులోనే ఉండిపోవడంతో చనిపోయాడు. బస్సుల్లో చిన్నారుల భద్రతకు సంబంధించి అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో స్కూల్ ప్రిన్స్‌పాల్‌తో పాటు బస్సు డ్రైవర్, సూపర్‌వైజర్‌కు జైలు శిక్ష పడింది. మృతి చెందిన బాలుడి కుటుంబానికి లక్ష దిర్హామ్‌ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

English summary
A six-year-old Indian boy died after he was left behind alone in a bus for several hours in Dubai.The child, identified as Mohamed Farhan Faisal from the south Indian state of Kerala, was a student at an Islamic centre in Al Quoz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X