వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: కోట్ల రూపాయల వ్యాపారం ఒకే దెబ్బకు ఔట్..దుబాయ్‌లో చాయ్‌వాలాగా సెటిల్

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు ఒంటిచేత్తో కోట్లు గడించాడు. తన వ్యాపారాన్ని విస్తరించాడు. కానీ ఒకే ఒక దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాడు. ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు. ఆయనకున్న కంపెనీలను మూసేశాడు. చివరకు ఆ దేశంలో వంటలు చేసుకుంటూ బతికేస్తున్నాడు. ఇంతకీ ఎవరతను.. ? మంచి లాభాల్లో నడుస్తున్న వ్యాపారం ఒక్కసారిగా మూతబడటానికి కారణం ఏమిటి..?

ఎరువుల కంపెనీతో లాభాలు

ఎరువుల కంపెనీతో లాభాలు


ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నిజీష్ సహదేవన్. కేరళ రాష్ట్రానికి చెందిన సహదేవన్ ఎస్వీఆర్ ఆగ్రో ప్రాడక్ట్స్‌కు ఒకప్పుడు అధినేత. ఇది ఒక ఎరువులు తయారు చేసే సంస్థ. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు ఉన్న సమయంలో ఒక్కసారిగా 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన సహదేవన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. 462 మందికి ఉపాధి కల్పించిన సంస్థ ఒక్కసారిగా బంద్ అయ్యింది. తను 18 ఏళ్ల వయస్సులో ఎరువుల సంస్థను ప్రారంభించినట్లు చెప్పిన సహదేవన్.. తమ సంస్థ నుంచి తయారయ్యే ఎరువులకు బాగా డిమాండ్ ఉండేదని గుర్తుచేశాడు. ఇంజినీరింగ్ చదవిని సహదేవన్ ఒక పారిశ్రామికవేత్త కావాలని కలలు కన్నట్లు చెప్పాడు.

గల్ఫ్ దేశాల నుంచి ఆర్డర్లు, అదే సమయంలో..

గల్ఫ్ దేశాల నుంచి ఆర్డర్లు, అదే సమయంలో..

కేరళ ప్రభుత్వ సహకారంతో సంస్థను ప్రారంభించినట్లు చెప్పిన సహదేవన్... ఒక్క బాటిల్ ఎరువుల ధర రూ. 500గా అమ్మే వాడినని చెప్పాడు. ఈ ఒక్క బాటిల్‌ 2వేల మొక్కలకు ఉపయోగపడుతుందని వెల్లడించాడు. ఇక సహదేవన్ సంస్థ నుంచి తయారయ్యే ఎరువులకు మంచి డిమాండ్ రావడంతో ఈ వ్యాపారంను విస్తరించాలని భావించాడు. ఇందుకోసం రూ.3 కోట్లు రుణం తీసుకుని 250 మందికి ఉద్యోగాలు కల్పించాడు. ఇక తన ఎరువుల సంస్థ నుంచి గల్ఫ్ దేశాల్లో తెలియడంతో వారు కూడా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారని చెప్పాడు సహదేవన్. ఇక తనకు ఎదురులేదు అనుకుంటున్న సమయంలో 2016 నవంబర్‌లో పెద్ద నోట్లు రద్దును ప్రకటన చేసింది కేంద్రం. దీంతో ఒక్కసారిగా తమ క్లయింట్లు వెనకడుగు వేశారు. సరుకు మొత్తం అలానే ఉండిపోయింది. ఎవరూ కొనలేదు. ఒక్కసారిగి తన వ్యాపారం కుదేలయ్యింది. తన కలలు చెదిరిపోయాయి.

ఆదుకున్న చిన్ననాటి స్నేహితుడు

ఆదుకున్న చిన్ననాటి స్నేహితుడు

ఈ కష్టకాలంలో దుబాయ్‌లో ఉండే సహదేవన్ చిన్ననాటి స్నేహితుడు అబ్దుల్ రషీద్ దుబాయ్‌కు వచ్చేసి మంచి వ్యాపారం ఏదైనా పెట్టుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడు. ఫుడ్ మరియు బెవరేజ్ రంగంలో అడుగుపెట్టాల్సిందిగా సలహా ఇచ్చాడు. ఇందుకు సహాయం కూడా చేశాడు. ముందుగా ఒక టీ దుకాణంను తనతో పెట్టించాడు. ఒక్కసారిగా ఆ వ్యాపారం క్లిక్ అయ్యిందని చెప్పాడు సహదేవన్. ఇక తీసుకున్న రుణాలు తీర్చేందుకు తన ఆస్తులను అమ్మినట్లు చెప్పిన సహదేవన్... తన తండ్రి సమాధి ఉన్న భూమిని కూడా అమ్మివేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రోజు సహదేవన్ దుబాయ్‌లో టీ దుకాణం ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చడమే కాదు కొత్త ఇళ్లు కూడా కొన్నాడు.

 దుబాయ్‌లో ఆ టీ దుకాణం ఫేమస్

దుబాయ్‌లో ఆ టీ దుకాణం ఫేమస్


టీ షాపు నుంచి క్రమంగా మంచి రెస్టారెంట్ ప్రారంభించాడు. ఇప్పుడు ఆ రెస్టారెంట్‌లో టీ, స్నాక్స్‌తో పాటు కేరళలోని మలబార్ ప్రాంతపు వంటకాలు ఉంటాయి. దీంతో అనతి కాలంలోనే ఈ రెస్టారెంట్ పాపులర్ అయ్యింది. ఇదంతా రషీద్ వల్లే జరిగిందని చాలా గర్వంగా చెప్పుకుంటాడు సహదేవన్. అందుకే అతని ఐఫోన్‌లో రషీద్ నెంబర్‌ను గాడ్ అని సేవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం కరామా ప్రాంతంలో ఉన్న ఆ చిన్న టీ షాపు త్వరలోనే యూఏఈలో ఒక బ్రాండ్‌గా ఎదుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తన జీవితాన్ని సినిమాగా తీయాలని భావిస్తున్నట్లు చెప్పిన సహదేవన్.. ఖాళీ సమయాల్లో కొన్ని కథలు రాస్తుంటానని చెప్పాడు. ఏదో ఒకరోజు నిర్మాతను అవుతానని చెప్పాడు సహదేవన్

English summary
Nijeesh is the former owner of SVR Agro Products, a company that manufactured natural fertilisers in Thrissur, Kerala, made decent profit, and ran a workforce of 462 employees.Today, Nijeesh, 32, has lost his millions, and works as a cook and delivery boy at the Eranojli Moosakante Chayakkada, a tea shop and restaurant in Karama, Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X