వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: హెచ్ 1 బీ వీసాలను తగ్గించిన భారత కంపెనీలు, ఏటా 65 వేలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: హెచ్ 1 బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన కఠిన నిబంధనలతో భారతీయ ఐటీ కంపెనీలు హెచ్ 1 బీ వీసా దరఖాస్తులను భారీగా తగ్గించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకొన్నాడు. ముఖ్యంగా స్థానికులకు ఉద్యోగావకాశాల కోసం తీసుకొచ్చిన చట్టాలు ఇండియన్లపై ప్రభావం చూపుతున్నాయి.

ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై, ఇండియాకు చెందిన టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా తీసుకొచ్చిన కఠిన నిబంధనల కారణంగా హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తుల విషయంలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకొన్నాయి.

హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల తగ్గుదల

హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల తగ్గుదల

హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనల కారణంగా భారతీయ ఐటీ కంపెనీలు హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను తగ్గించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్‌ యంత్రాంగం వీసాల జారీ విషయంలో కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిన తర్వాత భారత ఐటీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు కూడా హెచ్‌-1బీ వీసాలను పొందే విషయంలో వెనుకడుగు వేస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

హెచ్ 1 బీ వీసా జారీలో నిబంధనలు

హెచ్ 1 బీ వీసా జారీలో నిబంధనలు


కొన్నేళ్ళుగా హెచ్ 1 బీ వీసా జారీలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు అమెరికా సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ వీసాల జారీ విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, టెక్కీలు, వీసాల జారీ కోసం దరఖాస్తులను భారీగా తగ్గించేశాయని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రాజెక్టులు ఆలస్యం

ప్రాజెక్టులు ఆలస్యం


టెక్నాలజీ ఓరియెంటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎన్వాయ్‌ గ్లోబల్‌ సర్వే ప్రకారం కంపెనీల్లో పనిచేస్తున్న 26 శాతం మంది ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రాజెక్టులను ఆలస్యంగా పూర్తి చేస్తున్నారని తేలింది. మరో 22 శాతం మంది ఉద్యోగులు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కారణంగా హెచ్‌-1బీ వీసాల విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు తేలింది.

హెచ్ 1 బీ వీసా ధరఖాస్తుల తగ్గుదల

హెచ్ 1 బీ వీసా ధరఖాస్తుల తగ్గుదల

2017తో పోలిస్తే 2018లో హెచ్ 1 బీ వీసాల దరఖాస్తుల కోసం దరఖాస్తులు చేసుకొన్న వారి సంఖ్య సుమారు 9 శాతం తగ్గే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నప్పటికీ, ఆ మేరకు సిబ్బంది లేరని సర్వేల్లో తేటతెల్లమైంది.

ప్రతి ఏటా 65 వేల వీసాలే

ప్రతి ఏటా 65 వేల వీసాలే


ఇక నుండి ప్రతి ఏటా 65 వేల వీసాలను మాత్రమే ఇవ్వాలని అమెరికా నిర్ణయం తీసుకొంది. హెచ్ 1 బీ వీసాల కారణంగా ఎక్కువగా ఇండియా, చైనాకు చెందిన టెక్కీలు ప్రయోజనం పొందుతున్నారు.అయితే ఈ వీసాల నిబంధనలను కఠినతరం చేసింది. ఏప్రిల్ 2వ తేది నుండి వీసాల ప్రక్రియ ప్రారంభమైంది. చిన్న తప్పులు కూడ టెక్కీలకు శాపంగా మారే అవకాశం లేకపోలేదు.

English summary
Indian IT companies have dramatically reduced their H-1B visa filings and foreign nationals are exhibiting reluctance to make the jump to a US company due to the Trump administration's hardline anti-immigration stance a top Silicon Valley newspaper has said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X