వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకారంతోనే: భారత కాన్సులేట్‌పై రక్తపు రాతలు

|
Google Oneindia TeluguNews

కాబూల్: ప్రతీకారంతోనే ఆఫ్ఘనిస్థాన్‌ దేశం మజార్‌ ఐ షరీఫ్‌ నగరం‌లోని భారత కాన్సులేట్‌ భవనంపై దాడి చేసినట్లు ఉగ్రవాదులు స్పష్టం చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది అప్జల్‌ గురూకి 2013లో భారత్‌ ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

అప్జల్‌గురు ఉరిశిక్షకు ప్రతీకారంగానే తాము ఈ దాడులకు పాల్పడుతున్నామని, ఒక అమరవీరుడు వెయ్యి మంది సూసైడ్‌బాంబర్స్‌కి సమానమని ఆఫ్ఘన్‌లోని భారత కాన్సులేట్‌ భవనం గోడలపై ఉగ్రవాదులు చనిపోయేముందు రక్తంతో రాశారు.

Indian consulate attack: Afghan attackers scrawled ‘Afzal Guru avenged’ on walls

గత ఆదివారం కూడా ఈ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా... భద్రతాదళాలు తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రదాడి అనంతరం ఇలాంటి రాతలు కార్యాలయ గోడలపై కనిపించాయి.

కాగా, మనదేశంలోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలోనే ఆఫ్ఘన్ దేశంలోని భారత కాన్సులేట్ భవనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం గమనార్హం. పఠాన్‌కోట్ ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు సైనికాధికారులు చనిపోగా, భారత సైన్యం కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

English summary
Four terrorists who attacked India’s consulate in Mazar-e-Sharif Sunday left behind graffiti written in their own blood stating that their mission was intended to avenge Afzal Guru, the J&K resident hanged in 2013 for his role in the December 13, 2000 attack on Parliament House in New Delhi, Afghan police sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X