వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/నాగపూర్: అమెరికా కాలిఫోర్నియాలోని శాంతాక్రూజ్ ఐస్‌లాండ్ ప్రాంతంలో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో 34మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాద మృతుల్లో ఓ భారతీయ జంట కూడా ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?

నాగపూర్ డాక్టర్ కూతురు, అల్లుడు..

నాగపూర్ డాక్టర్ కూతురు, అల్లుడు..

మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన పీడియాట్రిషియన్ సతీష్ డియోపుజారి కూతురు, అల్లుడు కూడా ఈ పడవలో ప్రయాణించినట్లు తెలిసింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఈ పడవ ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పడవ సిబ్బంది తప్ప మిగిలినవారంతా మృతి చెందారు.

రెండేళ్ల క్రితమే వివాహం..

రెండేళ్ల క్రితమే వివాహం..

డాక్టర్ డియోపుజారి దగ్గరి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డియోపుజారి కూతురు, డెంటిస్ట్ అయిన సంజీరి డియోపుజారి రెండేళ్ల క్రితం అమెరికాలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కౌస్తుభ్ నిర్మల్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా పెళ్లి తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డారు.

అదే పడవలో..

అదే పడవలో..

ఈ దంపతుల గురించి ఎలాంటి వార్త కూడా అధికారికంగా రాకపోయినప్పటికీ అదే పడవలో ప్రయాణించడంతో మరణించివుంటారనే భావిస్తున్నారు. డాక్టర్ డియోపుజారి మరో కూతురు కూడా అమెరికాలోనే ఉంటోంది. తన సోదరి గురించిన సమాచారం కోసం అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఆ ఐదుగురు తప్ప..

ఆ ఐదుగురు తప్ప..

మంటలు భారీగా చెలరేగడంతో పడవలోని ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని అక్కడి పోలీసులు తెలిపారు. పడవలో మొత్తం 33మంది ప్రయాణికులు 6గురు పడవ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పడవపైన ఉన్న ఐదుగురు సిబ్బంది సముద్రంలోకి దూకి చిన్న బోటు సహాయంతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

English summary
An Indian couple settled in the US is believed to among those who have died in a boat mishap that took place off Santa Cruz island in California on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X