వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్యాద చేశాం, దేవయానికి కాఫీ ఇచ్చాం: బరారా

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో భారత దౌత్య అధికారిణి దేవయాని కోబ్రాగాడెను వీసా అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో అక్కడి అధికారులు సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడం, నేరస్తుల పక్కన నిలబెట్టడమే కాకుండా దుస్తులు విప్పించి తనిఖీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో కొంత వెనక్కి తగ్గిన అమెరికా ప్రభుత్వం ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా అటార్నీ ప్రీత్ భరారా సుదీర్ఘమైన ప్రకటనను విడుదల చేశారు.

అయితే అరెస్ట్ చేసిన సమయంలో దేవయాని కోబ్రాగాడేను ఏ మాత్రం అవమానించలేదని, మర్యాదపూర్వకంగానే చూసుకున్నామని భారత సంతతికి చెందిన అమెరికా అటర్నీ ప్రీత్ భరారా తెలిపారు. ఆమెకు సొంత కారులో కూర్చుని ఫోన్ మాట్లాడేందుకు అనుమతించామని, కాఫీ కూడా అందించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతా చట్టప్రకారమే చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెయ్యి పదాలతో కూడిన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు.

Devyani Khobragade

కోబ్రాగాడె ఇంట్లో పనిమనిషి సంగీతా రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి తరిమేశారని, ఆమెను నోరు తెరవకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బలవంతంగా సంగీతను భారత్ రప్పించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. యూఎస్ విదేశాంగ శాఖ అధికారులు దేవయానిని అరెస్ట్ చేసింది వాస్తవమేనని, కానీ ఆమెకు సంకెళ్లు వేయలేదని భరారా చెప్పారు. ఓ మహిళా డిప్యూటీ మార్షల్ ప్రత్యేకమైన గదిలో దేవయాని కోబ్రాగాడేను పూర్తిగా తనిఖీ చేశారని తెలిపారు. ధనవంతులైనా, పేదలైనా, అమెరికన్లయినా, కాకపోయినా అందరికీ ఆ నిబంధన వర్తిస్తుందని చెప్పారు.

ఇంకా కోబ్రాగాడేకు కాఫీ కూడా ఇచ్చామని, తన పిల్లవాడి సంరక్షణ చూసుకోవడానికి, ఫోన్ కాల్స్ చేసుకోవడానికి కూడా అనుమతించామని భరారా చెప్పుకొచ్చారు. అంతేగాక పౌరహక్కులు, చట్టాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాదా లేక భారత ప్రభుత్వం, ఆ దేశ దౌత్యవేత్తలదా అని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎవరైనా సరే వారిని బాధ్యులుగా చేయడం, వాళ్ల సామాజిక హోదా ఏదైనా, ధనవంతులైనా, శక్తిమంతులైనా సరే ఒకే న్యాయాన్ని అమలు చేయడమే తమ బాధ్యత అని ప్రీత్ భరారా చెప్పుకొచ్చారు.

అమెరికా చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్, దేవయాని కోబ్రాగాడేను ఐక్య రాజ్య సమితిలో భారత్ తరపున పూర్తి ఇమ్యూనిటీ గల అధికారిణిగా నియమిస్తున్నట్లు భారత కాన్సులేట్ అధికార ప్రతినిధి వెంకటస్వామి పెరుమాల్ తెలిపారు. ఇది ఇలా ఉండగా సంగీతా రిచర్డ్‌కు పాస్‌పోర్ట్ లేనందున ఆమెకు తాత్కాలికంగా చట్టబద్ధమైన హోదా కల్పించి, అమెరికాలోనే ఉండి పని చేసుకోవడానికి అనుమితించినట్లు ఆమె తరపు న్యాయవాది డానా సుస్‌మన్ తెలిపారు.

English summary
A federal prosecutor has ventured into the tense relationship between the US and India, defending the arrest and strip-search of an Indian diplomat held on visa charges and saying she was treated very well, even given coffee and offered food while detained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X