వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఆర్థిక వ్యవస్థ అంధకారంలో ఉంది: నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ

|
Google Oneindia TeluguNews

అమెరికా: భారత ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైందని అభిప్రాయపడ్డారు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత భారత సంతతి వ్యక్తి అభిజీత్ బెనర్జీ. సమస్య ఉందని తెలిసి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందని ఆయన చెప్పారు. మస్సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాట్లాడిన అభిజీత్ బెనర్జీ తన దృష్టిలో భారత ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెప్పారు.

Recommended Video

#NobelPrize2019 : నోబెల్ విజేత అభిజిత్ బెన‌ర్జీ ప్రొఫైల్‌ | Abhijit Banerjee Win Nobel In Economics

గూగుల్ తల్లి చెప్పని నిజం: తీహార్ జైలులో నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీగూగుల్ తల్లి చెప్పని నిజం: తీహార్ జైలులో నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ

 భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది

భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది

భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ఎలాగుంటుందని ప్రశ్నించగా భవిష్యత్తు గురించి మర్చిపోండి అని చెప్పిన బెనర్జీ... ప్రస్తుత పరిస్థితి చూస్తే అత్యంత దయనీయంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదానిపై మాట్లాడటం కంటే ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియాల్సి ఉందని అన్నారు. ప్రతి ఏడాదిన్నరకు నేషనల్ శాంపుల్ సర్వే తన గణాంకాలను బయటపెడుతుంది. ఆ సమాచారంను ప్రస్తావించిన అభిజీత్... 2014-15, 2017-18కి ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందన్నారు. ఇలా పడిపోవడం చాలా చాలా ఏళ్ల తర్వాత జరుగుతోందన్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను అంధకారంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకోదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకోదు

భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్న అభిజీత్ బెనర్జీ... ప్రభుత్వానికి లెక్కలు వ్యతిరేకంగా ఉంటే అది ఒప్పుకునే స్థితిలో ప్రభుత్వం లేదని చెప్పారు.ఇలా ఒప్పుకోకుండానే ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉందని పరోక్షంగా ప్రభుత్వం చెప్పినట్లయ్యిందని అభిజీత్ తెలిపారు. ఇలా ఆర్థిక వృద్ధి రేటు అత్యంత వేగంగా పడిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం లోటు బడ్జెట్‌తో నడుస్తోందని చెప్పిన అభిజీత్... అయితే అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేందుకు కొన్ని మంత్రాలను పటిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు.

 సమాధానం దాటవేసిన నిర్మలా సీతారామన్

సమాధానం దాటవేసిన నిర్మలా సీతారామన్

ఇదిలా ఉంటే గతవారం ముంబైలో మాట్లాడిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్... దేశంలో ఆర్థికమాంద్యం ఉందన్న దాంతో ఏకీభవిస్తారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు. ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తోందంటూ సమాధానం ఇచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి పలు పారిశ్రామికవేత్తలను కలిసి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆయా రంగాల వారీగా భేటీ అవుతూ ప్రభుత్వం వాటి కోసం ఏం చేయగలదో అది చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.

English summary
Indian-American Abhijit Banerjee, who won the 2019 Nobel Economics Prize said on Monday that the Indian economy is "doing very badly" even as the government is increasingly recognising that there is a problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X