వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారత ఎంబసీ: వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా వీసా, పాస్‌పోర్ట్, ఓసీఐ ఆన్‌లైన్ దరఖాస్తుల అనుమతి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వీసా, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసిఐ), త్యజించడం, పాస్‌పోర్ట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (జిఇపి) సేవలకు ఆన్‌లైన్ దరఖాస్తులను నవంబర్ 4 నుంచి కొత్త సర్వీస్ ప్రొవైడర్ విఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా అంగీకరిస్తోంది.

ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ సేవలకు వర్తించే భారత ప్రభుత్వ రుసుముతో పాటు, ప్రతి దరఖాస్తుకు 15.90 డాలర్లు (అన్ని పన్నులతో సహా) సేవా రుసుము వసూలు చేయబడుతుంది. నవంబర్ 4న వీఎఫ్ఎస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి ముందు దరఖాస్తులను విఎఫ్‌ఎస్‌కు పంపవద్దని సూచించారు.

'కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న కారణంగా, తదుపరి నోటీసు వచ్చేవరకు వీఎఫ్ఎస్ గ్లోబల్ వద్ద వాక్-ఇన్ సేవ ఉండదని కూడా గమనించవచ్చు. అన్ని దరఖాస్తులు పోస్ట్ ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయి' అని ప్రకటనలో పేర్కొన్నారు.

 Indian Embassy in US to accept online applications for visa, passport, OCI services through VFS Global

వీసా, ఓసిఐ, రెనాసియేషన్, పాస్‌పోర్ట్, జిఇపిలకు అవుట్‌సోర్సింగ్ సేవలను అందించే సేవా కేంద్రం కాక్స్ అండ్ కింగ్స్ గ్లోబల్ సర్వీసెస్ (సికెజిఎస్) అక్టోబర్ 14 న తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అక్టోబర్ 10న ఎంబసీ ప్రకటించింది.

సికెజిఎస్ మూసివేసిన తర్వాతవాత, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యక్ష పరిమిత సేవలను అందిస్తామని ఎంబసీ పబ్లిక్ నోటీసులో స్పష్టం చేసింది.

English summary
Indian Embassy in US to accept online applications for visa, passport, OCI services through VFS Global.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X